Andhra Pradesh: వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీ ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే పార్టీ పదవులకు కూడా రాజీనామా చేశారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి కళ్యాణ్ చక్రవర్తి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. గురువారం రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావులు వైసీపీని వీడారు. వీరు కూడా టీడీపీ గూటికి చేరనున్నట్లు సమాచారం. మరికొంత మంది ఎంపీలు కూడా పదవులతో పాటు పార్టీకి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Andhra Pradesh: వైసీపీకి మరో షాక్.. ఇద్దరు ఎమ్మెల్సీలు గుడ్‌బై
- వైసీపీకి మరో బిగ్ షాక్
- తమ పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు
- పార్టీ పదవులకు కూడా రాజీనామా చేసిన కళ్యాణ్ చక్రవర్తి.. కర్రి పద్మశ్రీలు