NTV Telugu Site icon

Kaleru Venkatesh : అమ్మవారిని దర్శించుకుని పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

Mla Kaleru

Mla Kaleru

తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఈ సారి ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. దీంతో ఆయా అభ్యర్థులు తన నియోజకవర్గంపై ఫోకస్‌ పెట్టారు. ప్రజలకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఈ సారికూడా బీఆర్‌ఎస్‌ గెలుపు కృషి చేయాలని కోరుతున్నారు. అంతేకాకుండా.. ఈ సారి సీఎం కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. అయితే.. ఈ నేపథ్యంలో అంబర్‌పేట్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ వడివడిగా ఎన్నికల ప్రచారంలో కొనసాగుతున్నారు. ఇప్పటికే ఆయన తన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు.

Also Read : Imman: ఆ స్టార్ హీరో నన్ను మోసం చేశాడు.. సంగీత దర్శకుడు సంచలన ఆరోపణలు

ఈ క్రమంలోనే నేడు అంబర్‌పేట్ మహంకాళి దేవాలయంలో మహంకాళి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌… అనంతరం నేటి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లోనూ సీఎం కేసీఆర్‌ విజయం సాధిస్తారని, తెలంగాణ బీఆర్ఎస్‌ సర్కార్‌ హ్యాట్రిక్‌ కొడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో మహిళలకు పెద్ద పీట వేశారు.. అదే అంశాన్ని ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తూ మహిళలకు వివరించడం జరుగుతోందన్నారు. ఈ ప్రచారంలో మహిళల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది.. మహిళల నుంచి వస్తున్న స్పందన ద్వారా టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విజయం తప్పకుండా సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్.

Also Read : Bigg Boss 7 Telugu: రైతు బిడ్డ పై రెచ్చిపోయిన మాస్టర్.. ఈ వారం నామినేషన్ లో ఉన్నది ఎవరంటే?