NTV Telugu Site icon

Kakarla Suresh: దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో కాకర్ల సురేష్

Kakarla Suresh

Kakarla Suresh

Kakarla Suresh: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం అయ్యవారిపల్లి గ్రామ సమీపంలో జగన్మాత ఈశ్వరీ దేవి ఆలయంలో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్‌ పాల్గొన్నారు. భ్రమరాంబ సమేత శ్ మల్లికార్జున స్వామి, గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి, మహాగణపతి సిద్ధ మూర్తి, నందీశ్వరుడు, నాగదేవతలు, నవగ్రహములు మొదలగు దేవత మూర్తుల విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో కాకర్ల సురేష్ పాల్గొని జగద్మాత ఈశ్వరీ దేవి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

Read Also: Kakarla Suresh: ఎన్నికల శంఖారావంతో వింజమూరు అదరాలి.. వైసీపీ బెదరాలి.. టీడీపీ గెలవాలి

ప్రతిష్ట నిర్వాహణ అర్చకులు దొడ్డుజు సుబ్రహ్మణ్యాచార్యులు, కోడూరు శ్రీనివాసాచార్యులు, దొడ్డుజ గంగాధర ఆచార్యులు, వేలూరు విష్ణువర్ధనాచార్యులు, కురిసేటి విష్ణు ఆచార్యులు కాకర్ల సురేష్‌కు ఆశీర్వాదాలు అందజేశారు. అంతకుముందు ఆలయ ధర్మకర్త కురిచేటి వెంకటేశ్వర్లు, సీతారాంపురం మండల నాయకులు, అయ్యవారిపల్లి గ్రామ పెద్దలు, భక్త బృందం కాకర్ల సురేష్‌కు ఘన స్వాగతం పలికారు.