Kakarla Suresh: ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు కోసం తల్లి కాకర్ల మస్తానమ్మ, అత్త కడియాల పద్మావతి, మామ కడియాల వెంకటేశ్వర్లు కలిగిరి మండలం లక్ష్మీపురం పంచాయతీ కండ్రిక గ్రామంలో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. లక్ష్మీపురం పంచాయతీ కండ్రిక గ్రామంలో ఇంటింటికి తిరిగి మహిళలకు కాకర్ల సురేష్ తల్లి తన తనయుడిని గెలిపించాలని బొట్టు పెట్టి మరి చెప్పారు. టీడీపీ ప్రవేశపెట్టనున్న పథకాలను వివరించారు. తమ తనయుడు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని మంచి ఆశయంతో వచ్చారని ఆశీర్వదించాలని తెలిపారు. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లాలో 150 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి రాజకీయాలలోకి రాక ముందు నుంచి సేవ చేస్తున్నారని, ఆయన నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని.. సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
Read Also: Pemmasani Chandrashekar: కొందరి అవినీతి వల్లే నీటి సమస్య.. ఒక్కొక్కరి బాగోతం బయటపెడతా..
ఆ గ్రామ ప్రజలు తనయుడు కోసం అల్లుడు కోసం చేస్తున్న ప్రచారానికి మద్దతు తెలుపుతూ వారి వెంట నడిచారు కాకర్ల సురేష్ అత్తమామలు. ఏ ఇంటికి వెళ్ళినా అపూర్వ స్వాగతం పలికారని వారు వెల్లడించారు. ఎర్రటి ఎండలో చేస్తున్న ప్రచారాన్ని చూసిన అవ్వ తాతలు అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు, ఎందుకమ్మా ఇంత కష్టం.. మీరు తిరగాల్సిన అవసరం లేదు, మేము తెలుగుదేశాన్ని ఆదరిస్తామని తెలిపారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మునగాల చంద్రమౌళి, బూత్ కన్వీనర్ వల్లేటి రఘు, గొట్టిపాటి రామకృష్ణ, కోట యానాది రెడ్డి, కొండపనాయుడు, మోహన్, గొట్టిపాటి రవి, జి రవి, గంగినేని కౌశిక్, తదితరులు ఉన్నారు.
