Kakarla Suresh: ఉదయగిరి మండలంలో ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు పల్లె ప్రజలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ ఇంటింటి ప్రచారంలో ఆయన వెంట నడిచారు. ప్రతి ఇంటికి తిరిగి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగు దేశాన్ని గెలిపించాలని కాకర్ల సురేష్ అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధి మాత్రమే పల్లెల్లో కనిపిస్తుందని అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం అధోగతి పాలై 20 సంవత్సరాలు వెనక్కి పోయిందన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా పాలిస్తున్న మేకపాటి కుటుంబం వల్ల ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉంది తప్ప ముందుకు పోలేదన్నారు. గత 40 సంవత్సరాల క్రితం ఉన్న సమస్యలు నేటికీ అలాగే ఉన్నాయి తప్ప మార్పు రాలేదన్నారు. మార్పు కావాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, తనను గెలిపించాలని ప్రజలను కాకర్ల సురేష్ అభ్యర్థించారు. పుల్లాయపల్లెలో టీడీపీ సీనియర్ నాయకులు కే ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన అనుచరులు గజమాలతో ఘనంగా సన్మానించారు. గ్రామస్తులందరికీ విందును ఏర్పాటు చేశారు. ఆ విందులో కాకర్ల సురేష్ పాల్గొన్నారు.
ముందుగా శకునాల పల్లె వైసీపీ సీనియర్ నాయకులు కారంపూడి చెన్నకేశవులు నాయుడు.. ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ కండువా కప్పి ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయ రామిరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ పొన్నబోయిన చంచల బాబు యాదవ్, ఉదయగిరి మండల అధ్యక్షులు బయన్న, తెలుగు యువత అధ్యక్షులు చింతల శ్రీనివాసులు, సీతారాంపురం మండలం క్లస్టర్ ఇంచార్జ్ వెంగళ శెట్టి వెంకటేశ్వర్లు, జనసేన కోఆర్డినేటర్ బోగినేని కాశీ రావు, బీజేపీ నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి రంగారావు, యువ మోర్చా అధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి, జనసేన అధ్యక్షులు పోలిశెట్టి శ్రీనివాసులు, ఆల్లూరు రవీంద్ర చంద్రారెడ్డి, ప్రసన్న, అబ్రహం, జాషువా, పిడుగు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం వింజమూరు మండలం కిస్తీపురం, బుక్కపురం, చింతలపాలెం, చంద్రపాడియా గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవి ఒక ఉద్యోగంగానే భావిస్తానన్నారు.ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి మంచి నీటి కొరతను తీరుస్తామన్నారు.
