Site icon NTV Telugu

Kakani Govardhan Reddy: జగన్ను తిడితే పదవిలు వస్తాయని పోటీ పడి మరీ నోరు పారేసుకుంటున్నారు..!

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy: నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వంపై రైతులు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో చంద్రబాబుకు మా నిరసనతో అర్థమైంది అన్నారు. ముఖ్యంగా, ఇటీవల జరిగిన రైతు ఉద్యమాన్ని ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టి వారి పోరును నీరుగార్చాలని చూస్తున్నట్లు తెలిపారు. ప్రతి చోట నోటీసులు జారీ చేయడం, హౌస్ అరెస్టులు విధించడం, కేవలం 15 మందితోనే ర్యాలీ నిర్వహించాలన్న నియమాలను కఠినంగా అమలు చేయడం ద్వారా నిరసనకు అడ్డంకులు వేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. అంతేగాక, అర్ధరాత్రి 1:29కి వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారని ఆయన అన్నారు.

Breaking : కేరళలో ‘కాంతార చాఫ్టర్ -1’ రిలీజ్ బ్యాన్ చేసిన ఎగ్జిబిటర్స్… కారణం ఇదే

రైతులకు సంబంధించిన యూరియా సరఫరా విషయాల్లో ప్రభుత్వం కోపాన్ని చూపుతోందని, రైతుల సమస్యలపై దృష్టిపెట్టకపోవడం ప్రభుత్వ బాధ్యతలలో లోపమని అన్నారు. నెల్లూరు జిల్లాలో అక్రమ గ్రావెల్ మైనింగ్, భూమి కబ్జాలు మితిమీరిపోతోందని, ఆపిఐసిసి భూములను అక్రమంగా కబ్జా చేసి సిలికా తవ్వకాలు చేపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా, జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ద్వారా పదవులు వస్తాయని పోటీ పడి నేతలు నోరు పారేసుకుంటున్నారని ఆయన అన్నారు. జగన్ కాలి గోటికి సరిపోని వారు కూడా ఆయనను విమర్శిస్తున్నారు అంటూ, ఇలాంటి విమర్శల స్థాయి గుర్తించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.

YS Jagan Setairs Chandrababu: చంద్రబాబు సొంత నియోజక వర్గంలోనూ ఎరువులు దొరకట్లేదు..

Exit mobile version