NTV Telugu Site icon

Dulam Nageswara Rao: కైకలూరు నియోజకవర్గంలో వైసీపీ సముద్రం లాంటిది..

Dulam Nageshwara Rao

Dulam Nageshwara Rao

Dulam Nageswara Rao: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీ పార్టీ జోరు పెంచింది. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్, ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావులు హాజరయ్యారు. పార్టీ ఆఫీసు నుంచి కార్యకర్తలతో బైక్ ర్యాలీగా సభాస్థలానికి చేరుకొని కార్యకర్తలకు దూలం నాగేశ్వరరావు దిశానిర్ధేశం చేశారు. దూలం నాగేశ్వరావు మాట్లాడుతూ… కూటమి అభ్యర్థి తనదే హవా అని తిరుగుతూ ఉంటారని.. కానీ కైకలూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సముద్రం లాంటిదన్నారు. కైకలూరులో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Read Also: Yarlagadda Venkatarao: ఉంగుటూరు మండలంలో యార్లగడ్డ ప్రచార హోరు..

కార్యకర్తలు ప్రజల చెంతకు వెళ్లి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, మళ్లీ ప్రభుత్వం వస్తే చేపట్టబోయే పథకాల గురించి వివరించాలని సూచించారు. రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు పడేవిధంగా గ్రామాల్లో ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతి కార్యకర్త ఒక స్టార్ క్యాంపెయినర్గా పనిచేయాలని.. ఇంకా తక్కువ రోజులే ఉన్నాయని కార్యకర్తలకు గుర్తు చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు. జగనన్నను ముఖ్యమంత్రిగా మరోసారి చేసుకుంటే కలిగే ప్రయోజనాలను ఓటర్లకు వివరించాలని కార్యకర్తలను కోరారు. అనంతరం కైకలూరు పార్టీ కార్యాలయంలో 100 మంది ముస్లిం యువకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువా కప్పి ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరావు సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు.