NTV Telugu Site icon

Kadiyam Srihari: పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజయ్య ఇద్దరూ తోడు దొంగలు..

Kadiam

Kadiam

హనుమకొండ జిల్లా ధర్మసాగర్, వేలేరు మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని.. వందల కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి వల్ల రాజేశ్వర్ రెడ్డి అని ఆరోపించారు. వందల కోట్ల ఆస్తులు ఉండొచ్చు కానీ నన్ను విమర్శించే స్థాయి కాదు.. 104 కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్లు కాంట్రాక్టర్ వద్ద కమిషన్ తీసుకున్న వ్యక్తివి నీవు.. దళిత బంధులో రాజయ్య, లిఫ్ట్ ఇరిగేషన్లు నువ్వు తీసుకున్నది వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. నీవు కమిషన్లు తీసుకున్నట్లు నిరూపిస్తే.. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తావని పల్లా అంటూ సవాల్ విసిరారు. అదే లిఫ్ట్ ఇరిగేషన్ లో నేను ఒక్క రూపాయి కమిషన్ తీసుకున్నట్టు నిరూపిస్తే.. నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు.

Read Also: Namburu Sankara Rao: ఎమ్మెల్యే నంబూరి శంకరరావు సమక్షంలో వైసీపీలోకి చేరికలు..

పల్లా రాజేశ్వరరెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడకు నీ బ్రతుకంతా నాకు తెలుసు అని కడియం శ్రీహరి తెలిపారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలు తెచ్చుకోలేదు.. మనబడి మన ప్రణాళిక లో సొంత తమ్ముడికి కాంట్రాక్టు ఇప్పించిన పల్లా.. మనబడి మన ప్రణాళికలో తన తమ్ముడిపై కేసు నమోదు అయ్యింది.. భూ కబ్జాలు చేశాడని పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కూడా కేసు నమోదు అయింది అని ఆయన చెప్పుకొచ్చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓ దొంగ, రాజయ్య మరో దొంగ.. వీరిద్దరూ తోడు దొంగలు అంటూ విమర్శలు గుప్పించారు. తోడు దొంగలు వస్తున్నారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కడియం శ్రీహరి సూచించారు.