NTV Telugu Site icon

Kadiyam Srihari: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

Kadiyam Srihari

Kadiyam Srihari

Kadiyam Srihari: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై మాజీ మంత్రి కడియం శ్రీహరి స్పందించారు. సుప్రీం కోర్టులో ఉన్న MLAల అనర్హత కేసుపై ఈ నెల 10న తీర్పు వెలువడనుంది. ఈ తీర్పును తాను తప్పకుండా శిరసావహిస్తానని ఆయన స్పష్టంగా తెలిపారు. కోర్టు తీర్పు ప్రకారం ఉపఎన్నికలు జరిగితే, తాను తప్పకుండా పోటీ చేస్తానని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఇందులో వెనుకడుగు తీసుకునే ఆలోచన లేదని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. BRS పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన కడియం శ్రీహరి, BRS స్వార్థపరమైన రాజకీయాలు చేస్తోందని, ఫిరాయించిన MLAలను మంత్రులుగా చేసిన ఘనత కూడా BRSదే అంటూ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం BRS నాయకులు సుద్ధపూసలాగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

Also Read: India vs England: కోహ్లీ, వరుణ్‌ చక్రవర్తి ఇన్.. మొదట బ్యాటింగ్ చేయనున్న ఇంగ్లీష్ జట్టు

ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు BRSకు లేదని ఆరోపించిన కడియం శ్రీహరి, ఇలాంటివి ” BRS చేస్తే సంసారం.. మేము చేస్తే వ్యవభిచారమా?” అని కాస్తగా ఘాటుగానే అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఉపఎన్నికలు జరిగితే తాను ఎన్నికల బరిలో ఉంటానని, మరో ఆలోచన లేదని కడియం శ్రీహరి కుండబద్దలు కొట్టేశారు. BRS పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.