NTV Telugu Site icon

Kadiyam Srihari : సీఎం రేవంత్ రెడ్డి నోటికి హద్దు, అదుపు లేదు

Kadiyam Srihari

Kadiyam Srihari

సీఎం రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నోటికి హద్దు, అదుపు లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి సీఎం ను అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. సీఎంకు ఉండవలసిన హుందాతనం రేవంత్ రెడ్డిలో లోపిస్తుందన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ కార్యకర్త లాగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నా తీరు చూస్తుంటే చాలా భాద అనిపిస్తుందన్నారు కడియం శ్రీహరి. మీరు తిడుతుంటే…మేము పడుతూ ఉంటామా?.. మాకు కూడా చీము,నెత్తురు ఉన్నదిగా….మేము కూడా ఎదో ఒక భాషలో తిట్టాలాగా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ను చార్లెస్ శోభరాజ్, కేటీఆర్- హరీష్ రావు లను బిల్లా-రంగా అని విమర్శించడం విడ్డూరమన్నారు. చార్లెస్ శోభరాజ్, బిల్లా- రంగా కంటే పెద్ద చరిత్ర రేవంత్ రెడ్డిది అని, రేవంత్ రెడ్డి చరిత్ర తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు.

 

సభ్యత సంస్కారం తెలుసుకొని రేవంత్ రెడ్డి మాట్లాడాలన్నారు. బీఆర్‌ఎస్‌ ను బోందపెట్టేవాడు.. ముక్కలు చేసేవాడు ఇంకా పుట్టలేదన్నారు. బీఆర్ఎస్ ను పాతిపెట్టడం ఎవరితో కాదు.. నీ అయ్యాతో కూడా కాదన్నారు. పాలకుర్తి నియోజకవర్గం BRS విస్తృతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు కడియం శ్రీహరి. ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చినా కూడా రేవంత్‌ రెడ్డిలో ఎలాంటి మార్పు కనపడటం లేదన్నారు కడియం శ్రీహరి. సీఎంగా ఉన్నప్పుడు కొంచెం హుందాగా ఉండటం నేర్చుకోవాలని హితవు పలికారు. బీఆర్‌ఎస్‌ను బొంద పెట్టే మొనగాడు పుట్టలేదన్నారు. గతంలో కేటీఆర్‌ దావోస్‌ వెళ్లినప్పుడు ఎంతో హుందాగా ప్రవర్తించారని గుర్తు చేశారు. పెట్టుబడులు సాధించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారని చెప్పుకొచ్చారు. దేశంలోనే రోల్ మోడల్ తెలంగాణాను అభివృద్ధి చేసిన కేసీఆర్‌ను ఇష్టమున్నట్టు తిట్టడం సరికాదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విసుగు ప్రారంభం అయిందని తెలిపారు. కేసీఆర్‌ను అనవసరంగా ఓడించామని బాధపడుతున్నారని అన్నారు. ఇక.. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. బీఆర్‌ఎస్‌ విజయం సాధించడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు.

 

Show comments