Kadiyam Srihari: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కల్వకుంట్ల కవిత ఆరోపణలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో కూడా మొదటి సారి మీడియా ఎదుట స్పందించారు. ఆయన కవిత ఎపిసోడ్‌పై మాట్లాడుతూ.. అది ఆస్తి తగాదాలకు సంబంధించినది మాత్రమే అని అన్నారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులను అన్నింటిని కూడా దొచుకుంది. ధరణిని అడ్డం పెట్టుకొని వేల ఎకరాల భూమిని కబ్జా చేశారు. కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల డబ్బులను సంపాదించుకున్నారు. ఇప్పుడు వేల ఎకరాలు పంచుకునే క్రమంలో, వేల కోట్ల రూపాయలను పంచుకునే క్రమంలో వారి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణపై పడి దోచుకుంది. అందుకే వారిని తెలంగాణ ప్రజలు పక్కన పెట్టారని కడియం పేర్కొన్నారు.
READ ALSO: Navdeep : నవదీప్ ఇమేజ్ డ్యామేజ్.. అనవసరంగా జడ్జిగా వెళ్లాడా..?
అయితే, ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న పంచాయతీతో ప్రజలకు, తెలంగాణకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. అది వాళ్ల కుటుంబ పంచాయతీ, ఆస్తుల గొడవ మాత్రమే. ఆనాడు కవిత లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యింది. నేను ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడానికి ప్రధానమైన కారణం ఒక ముఖ్యమంత్రి బిడ్డ లిక్కర్ కేసులో విచారణ ఎదుర్కోవడమే. ఆమె అనేక రోజులు జైలులో ఉండడం కూడా కొంచెం బాధగా అనిపించింది. ఇది సరైన పద్ధతి కాదని పెంచింది. అందుకే బీఆర్ఎస్ నుంచి బయటికి రావడం జరిగింది. ఏది ఏమైనా ఈ రోజు జరుగుతున్న గోడవ అంతా ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. పత్రికలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది అవినీతి ద్వారా సంపాదించిన డబ్బును పంచుకోవడం కోసం జరుగుతున్న పంచాయతీ తప్పా ఇది ప్రజలకు ఉపయోగపడే పంచాయతీ కాదని ఆయన అన్నారు.
READ ALSO: Comedian Ramachandra : కమెడియన్ కు పక్షవాతం.. నటుడు కిరణ్ ఆర్థిక సాయం..
కల్వకుంట్ల పంచాయతీ ఏంటంటే..
‘నాన్నా.. మీ చుట్టూ ఏం జరుగుతుందో ఓసారి చూసుకోండి’ అని బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్‌ను కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకునే కుట్ర జరుగుతోందని, మీకు ప్రమాదం పొంచి ఉందని సూచించారు. తమ కుటుంబం విచ్ఛిన్నమైతేనే కొందరికి అధికారం వస్తుందని.. ఇందులో భాగంగానే మొదటగా తనను బయటకు పంపించారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్లు, వ్యక్తిగత లబ్ధి పొందాలనుకునే వాళ్లు.. మన ముగ్గురం (కేసీఆర్, కేటీఆర్, కవిత) కలిసి ఉండకూడదని కుట్రలు చేశారని కవిత చెప్పుకొచ్చారు.