BRS: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య లేఖ రాశారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖలో కడియం కావ్య తెలిపారు. బీఆర్ఎస్‌పై అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య లేఖలో పేర్కొన్నారు. జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని కావ్య లేఖలో తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుండి విరమించుకుంటున్నానని కావ్య పేర్కొన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలు మన్నించాలని విజ్ఞప్తి చేశారు.
BRS: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. వరంగల్ ఎంపీ పోటీ నుంచి తప్పుకున్న కావ్య
Show comments