KA Paul: ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య సాగుతున్న యుద్ధం నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధినేత KA పాల్ స్పందించారు. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ.. నాపై ఎటువంటి ఒత్తిడి తెచ్చినా, చివరి శ్వాస వరకు శాంతి కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటానని అన్నారు. ఇజ్రాయిల్, ఇరాన్ వార్ చాలా విచారమైంది. ఈ విషయంలో ప్రపంచం సీరియస్ గా ఆలోచించాలి. ప్రపంచ మూడో యుద్ధాన్ని ఆహ్వానిస్తున్నారని.. ఇజ్రాయిల్ కు పలు దేశాలు మద్దతిస్తున్నాయని అయన అన్నారు.
Read Also: ACB Raids: లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన డీఈఓ, జూనియర్ అసిస్టెంట్..!
అయితే, నేను అక్కడికి వెళ్లలేకపోతున్నాను.. అక్కడ పరిస్థితులు అస్సలు బాగా లేవు, గతంలో అత్యంత దారుణ పరిస్థితులు చూశానని అన్నారు. అక్కడ బంకర్లలో ఉండి ప్రాణం దక్కించుకున్నానని, వాళ్ళు వినడం లేందంటూ వాపోయారు. యుద్ధాలు ఆగాలి.. ఈ విషయంలో తెలుగు ప్రజల సత్తా చూపెట్టాలి అంటూ మాట్లాడారు. యుద్ధాన్ని ఆపేందునుకు జీ7 సదస్సు, తన పవర్స్ ను ఉపయోగించాలంటూ కీలలకా వ్యాఖ్యలు చేసారు. సోషల్ మీడియాలో ఇజ్రాయెల్ దాడులు ఆపాలని డిమాండ్ చెయ్యాలి.. యుద్ధం ఆపాలని కోరాలంటూ ఆయన ప్రజలను కోరారు.
Read Also: CM Revanth: వైద్య కళాశాలల పనులపై కార్యాచరణ ప్రణాళిక.. అధికారులకు సీఎం ఆదేశం..!
అలాగే అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఆస్పత్రిలోని 38 మందికి కూడా న్యాయం చెయ్యాలని, నష్ట పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేసారు. కేంద్రం, ఎయిర్ ఇండియా, అదానీ స్పందించకపోతే సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేస్తానని.. ప్రధాని, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ లు రాజీనామా చెయ్యాలంటూ డిమాండ్ చేసారు.