Site icon NTV Telugu

KA Paul : ప్రజలు చూపంతా మా పార్టీ వైపు ఉంది

Ka Paul

Ka Paul

కత్తి మహేష్ నా శాపం వల్లే చనిపోయాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. రేపు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గం ఇంచార్జి లతో మీటింగ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 75 సంవత్సరాలుగా బానిసలుగా బ్రతుకు తున్నాము… ఇంకెంత కాలం ఈ బానిస బ్రతుకు…బయటకు రండి అంటూ ప్రజశాంతి పార్టీ లో చేరే వారికి పిలుపునిచ్చారు. ప్రజలు చూపు అంత మా పార్టీ వైపు ఉందని, బీఆర్‌ఎస్‌, బీజేపీ నుంచి చాలా మంది మా పార్టీ వైపు చూస్తున్నారన్నారు. అవినీతి చేసిన వారు మాత్రమే బిక్కు బిక్కుమంటూ బ్రతుకు తున్నారని, మీడియా సంస్థలు కూడా మణిపూర్ విషయంలో మొద్దు నిద్ర పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి మద్దతుగా మోడీ భజన చేస్తుంది తప్ప… జరిగిన తప్పులు చూపడం లో మీడియా విఫలం అయిందన్నారు.

Also Read : Telangana Cabinet: 31న తెలంగాణ కేబినెట్ భేటీ.. వరద సాయం, ఆర్టీసీ ఉద్యోగుల జీతాల పెంపుపై చర్చ

గతంలో నేను ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు దగ్గర ఉండి సమస్యకు పరిష్కారం చేశానని, మీడియా అమ్ముడు పోయిందని ఆయన అన్నారు. బానిస బ్రతుకులు విడండని, నేను తప్ప మణిపూర్ గురుంచి మాట్లాడిన పాస్టర్ ఎవ్వరు లేరన్నారు. పాస్టర్ సతీష్ కుమార్ కోట్లు రూపాయలు చర్చి లు పేరున సంపాదించి బీజేపీ కు విరాళాలు ఇస్తున్నారు..మణిపూర్ ఘటన గురుంచి కనీసం ఖాడించలేదని ఆయన ఆరోపించారు. సతీష్ కుమార్ కూడా నా శిష్యుడని, దేవుడి మందిరాని వ్యాపారం చేస్తున్నారని, నాకు దేశం లో జరుగుతున్న ఘటన లు చూస్తుంటే నిద్ర పట్టడం లేదన్నారు కేఏ పాల్‌.

Also Read : Assam CM: కాంగ్రెస్‌ లవ్‌ జిహాద్‌ వ్యాఖ్యలపై అసోం సీఎం ఫైర్‌

నరేంద్ర మోడీ నా శిష్యుడు…. అయినా మోడీ చేసిన తప్పులు నేను ఖండిస్తున్నానని, నేను సీక్రెట్ గా మణిపూర్ వెళ్లి ఘటన ను ఖండిచి వచ్చానన్నారు. కత్తి మహేష్ నా శాపం వాళ్లే మరణించారు…నా శాపం వాళ్ళ చాలా మంది పోయారని, బీజేపీ లో అందరు దొంగలున్నారని ఆయన మండిపడ్డారు. కిషన్ రెడ్డి లైఫ్ లో ఎమ్మెల్యే అవ్వడు… ముఖ్యమంత్రి అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడని, బడుగు బలహీన వర్గాలు ఇంటికో పార్టీ పెట్టడం వల్ల ఓట్లు చీలి అణగారిన వర్గాలు అధికారంలోకి వస్తాయి… మన బ్రతుకులు మారవు.. షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది అని ఎప్పుడో చెప్పాను… నేడు అదే జరుగుతుంది.. దేశాన్ని బీజేపీ నుంచి బయట పడేయాలి అనుకున్న వాళ్ళు అందరు నాతో కలిసి రండి అని ఆయన అన్నారు.

Exit mobile version