KA Paul: మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.. పవన్.. ప్రజాశాంతి పార్టీలో చేరితే సీఎంని చేస్తానని ప్రకటించిన ఆయన.. పవన్ కి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా.. ఎంత డబ్బు కావాలి..? అని ప్రశ్నించారు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన పాల్.. పవన్ కల్యాణ్, చంద్రబాబు పొత్తుతో ఒకే వేదిక మీద ఉన్న అతనిలో బాధ కనపడిందన్నారు.. కాపులు జనసేన, టీడీపి పొత్తుని వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ.. తిరుపతి సాక్షిగా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తాం అన్నారు. కానీ, ఆ మాట మర్చిపోయారని మండిపడ్డారు. దేశంలో మతతత్వం పెంచుతున్నారు.. జై శ్రీరామ్ అనకపోతే చంపేస్తాం అంటున్నారు. మోడీ పాలనలో ఇతర మతాల ప్రజలకి భద్రత లేదని ఆరోపించారు.
Read Also: Gaami Trailer: సరికొత్త ఫార్మాట్‌లో విశ్వక్ సేన్ ‘గామి’ ట్రైలర్.. ఇదే మొట్టమొదటిసారి!
ఇక, పాస్టర్లకి తాను రైఫిల్ కొనిస్తాను.. ఆత్మ రక్షణ కోసం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పాల్.. మరోవైపు.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆకస్మికంగా చనిపోతాడు అని చెప్పను.. అదే జరిగింది.. తెలంగాణలో కేసీఆర్ చిత్తుగా ఓడిపోతారు అని చెప్పను.. అది కూడా జరిగిందన్నారు. ఇప్పుడు దేశంలో రూపాయి విలువ పడిపోయింది.. మోడీ ప్రభుత్వం వచ్చాక అప్పు.. నెలకి లక్షా పదివేల కోట్లుకి చేరిందన్నారు. మోడీ తోత్తులు అయిన టీడీపీ, జనసేన పార్టీలని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. వైసీపీ సిద్ధం అంటుంది.. టీడీపీ – జనసేన దోచుకోవడానికి సంసిద్ధం అంటుంది.. కానీ, ప్రజల రక్షణ కోసం ప్రజాశాంతి పార్టీ, కేఏ పాల్ ఆత్మీయ యుద్ధం అంటున్నారు.. ఇక ప్రజలు తేల్చుకోవాలని సూచించారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.