Gaami Trailer: సరికొత్త ఫార్మాట్‌లో విశ్వక్ సేన్ ‘గామి’ ట్రైలర్.. ఇదే మొట్టమొదటిసారి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwak Sen’s Gaami Trailer to Be Released In PCX Format: మాస్ క దాస్ విష్వక్ సేన్ హీరోగా, విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గామి’. వి సెల్యులాయిడ్ పతాకంపై కార్తీక్ శబరీష్ ఈ చిత్రంను నిర్మించారు. శంకర్ అనే అఘోరా పాత్రలో విష్వక్ సేన్ కనిపించనున్నాడు. అఘోరా గెటప్‌తో పాటు మరో రెండు భిన్నమైన గెటప్‌లు కూడా ఇందులో ఉంటాయి. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో చాందిని చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు చూడని సరికొత్త కథతో వస్తున్న గామి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవల విడుదలైన గామి ఫస్ట్ లుక్, టీజర్ ఆ అంచనాలు రెట్టింపు చేశాయి.
ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గామి ట్రైలర్ త్వరలోనే రాబోతోంది. ఫిబ్రవరి 29న ట్రైలర్ లాంచ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. అయితే సరికొత్త ఫార్మాట్‌లో ట్రైలర్ రిలీజ్ అవుతోంది. గామి షోరీల్ ట్రైలర్ పీసీఎక్స్ ఫార్మాట్‌లో విడుదల అవుతోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రసాద్స్‌లోని పీసీఎక్స్ స్క్రీన్‌లో ఫిబ్రవరి 29న సాయంత్రం 4 గంటలకు ట్రైలర్‌ను లాంచ్ చేస్తున్నామని ప్రకటించారు. పీసీఎక్స్ ఫార్మాట్‌లో ఆవిష్కరించబడిన మొట్టమొదటి ట్రైలర్ ఇదే కావడం విశేషం.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
Also Read: Operation Valentine: నైజాం థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్న మైత్రీ మూవీస్!
మానవ స్పర్శకు దూరంగా ఉండే ఒక వ్యక్తి అఘోరాగా ఎలా మారాడు, లోతైన సత్యం కోసం అతని అన్వేషణ ఎక్కడివరకు సాగింది అనే పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కోసం విష్వక్ సేన్ చాలా కాలంగా కష్టపడుతున్నారు. కంటెంట్‌పై ఉన్న నమ్మకమే ఇందుకు కారణం. మరి సరికొత్త కథా, కథనాలతో వస్తున్న గామి సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!