K Raheja Group: సీఎంతో కె రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ భేటీ.. రూ.600 కోట్ల పెట్టుబడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K Raheja Group: తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు కె రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజా.. ఈ సమావేశానికి ఇనార్బిట్ మాల్స్ సీఈవో రజనీష్ మహాజన్, కె రహేజా గ్రూప్ ఆంధ్రా, తెలంగాణా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గోనె శ్రావణ్ కుమార్ హాజరయ్యారు.. అయితే, విశాఖపట్నంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణ పనుల శంకుస్ధాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఆహ్వానించారు కె రహేజా గ్రూపు ప్రతినిధులు.. విశాఖపట్నంలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణం చేపట్టనున్నారు.. మూడేళ్లలో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు కె రహేజా గ్రూప్ సిద్ధమైంది.. ఇక, ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని పెట్టుబడులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో చర్చించారు కె రహేజా గ్రూపు ప్రతినిధులు. ఈ కార్యక్రమంలో ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక, మూడు రాజధానులపై ముందుకు సాగుతోన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. త్వరలోనే విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభిస్తామని ప్రకటించిన విషయం విదితమే. విశాఖ పరిపాలన రాజధానిగా.. అమరావతి శాసన రాజధానిగా.. కర్నూలు న్యాయ రాజధానిగా చేస్తామని పలు సందర్భాల్లో సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Also: Padi Kaushik Reddy: ఈటల రాజేందర్‌కి ఎమ్మెల్సీ కౌశిక్ సూటి ప్రశ్న.. సమాధానం చెప్పాలని డిమాండ్
Also Read
- Jana Nayagan: విజయ్ 'లియో', రజనీ 'కూలీ' రికార్డులను దాటలేకపోయిన 'జన నాయగన్'.. డే-1 కలెక్షన్స్ ఎంతంటే?
- SA20 2027 షెడ్యూల్ విడుదల.. జనవరి 17 నుంచి షురూ.!
- Coffee Is Good for Your Heart?: కాఫీతో గుండె ఆరోగ్యం మెరుగవుతుందా..? తాజా అధ్యయనం ఏమి చెబుతోంది?
- Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
తాజావార్తలు
-
Jana Nayagan: విజయ్ ‘లియో’, రజనీ ‘కూలీ’ రికార్డులను దాటలేకపోయిన ‘జన నాయగన్’.. డే-1 కలెక్షన్స్ ఎంతంటే?
-
50 OTT Apps Blocked: అశ్లీల కంటెంట్‌పై కేంద్రం కఠిన చర్యలు.. 50 ఓటీటీ యాప్స్ బ్లాక్
-
SA20 2027 షెడ్యూల్ విడుదల.. జనవరి 17 నుంచి షురూ.!
-
Mayank Yadav: రెండేళ్లు నరకం అనుభవించా.. ఒంటరిగా కూర్చొని ఏడ్చేశా.. టీమిండియా మ్యాచ్ విన్నర్ భావోద్వేగం!
-
Coffee Is Good for Your Heart?: కాఫీతో గుండె ఆరోగ్యం మెరుగవుతుందా..? తాజా అధ్యయనం ఏమి చెబుతోంది?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్‌లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?