కాంగ్రెస్, బీఆర్ఎస్ కు బీసీలు ఎందుకు ఓటేయ్యాలని ప్రశ్నించారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్. ఇవాళ ఆయనతో పాటు మాజీ ఎంపీ బూర నర్సయ్య, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌లు రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఒక్క బీసీ మహిళకు కూడా టికెట్ ఇవ్వలేదని, బీసీని ముఖ్యమంత్రి చేసే బీజేపీకే ఓటేయ్యాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బీసీ సమాజం కదిలిరావాలని ఆయన కోరారు. అనంతరం బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. సూర్యాపేట బీసీ సీఎం డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. బీజేపీలోని అన్ని వర్గాల నేతలు కలిసి తీసుకున్న నిర్ణయమని, బీసీలకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామన్నారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఆదివాసీలు గుర్తించాలి.. 9 యేళ్లలో కేసీఆర్ ఆదివాసీలకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. బీసీల పట్ల బీఆర్ఎస్ కు చులకనభావం ఉందని మండిపడ్డారు. 135 కులాల బీసీ బిడ్డలు ఆలోచించాలి.. ఫలితం మీ ముంగిట్లో ఉందని, 40 సీట్లకు పైగా బీసీలకు ఇవ్వాలని బీజేపీ నిర్ణయం తీసుకుందన్నారు. చిన్న కులాలకు కూడా టికెట్లు ఇవ్వాలని మోడీ సూచించారని, బీజేపీ బాజాప్తా బీసీలకు ముఖ్యమంత్రి అని ప్రకటించిందన్నారు. బీసీల కల నెరవేరే సమయం వచ్చిందన్నారు ఈటల.
Also Read :Pocharam Srinivas Reddy: చంద్రబాబు అరెస్ట్ కక్షపూరితమైన చర్య.. పోచారం కీలక వ్యాఖ్యలు
అంతేకాకుండా.. ‘‘ఇతర రాష్ట్రాల బీఆర్‌ఎస్ ఇన్‌ఛార్జ్‌లు బీఆర్‌ఎస్ కుటుంబసభ్యులే ఉంటారు. ఇతర వర్గం, ఇతర కుటుంబసభ్యులకు అవకాశం ఇవ్వరు. తెలంగాణ వస్తే బడుగులకు అధికారం, జీవితాల్లో వెలుగు వస్తుందన్నారు. కానీ, ఒక్క కుటుంబంలో మాత్రమే వెలుగు వచ్చింది.. పదవులు వచ్చాయి. వారికి అధికారం ఇచ్చిన ప్రజల బతుకులు ఆగమయ్యాయి. రాజ్యాధికారంలో భాగం ఇస్తామని ఎస్సీలను మోసగించారు. బీసీల పట్ల బీఆర్ఎస్‌కు చులకనభావం, చిన్నచూపు ఉంది. దేశానికి ఓబీసీ ప్రధానిని అందించిన ఘనత బీజేపీదే. గిరిజన బిడ్డను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదే. కేంద్రంలో 70 శాతానికి పైగా అణగారిన వర్గాలకు చోటుదక్కింది’’ అని ఈటల తెలిపారు.
Also Read : Yogesh Kadyan: పెన్ను పట్టుకోవాల్సిన వయసులో గన్ను పట్టుకున్నాడు .. 19 ఏళ్లకే రెడ్ కార్నర్ నోటీసులు
