Jyothika: సూర్యతో విడాకులు.. అందుకే ముంబైలో జ్యోతిక.. అసలు నిజం ఏంటి.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jyothika: కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య- జ్యోతిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోనే మోస్ట్ అడోరబుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే.. ఈ జంట టాప్ 5 లో ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎప్పుడు బయట కనిపించినా.. జంటగా, సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియా వచ్చాకా సెలబ్రిటీలకు ప్రైవసీ లేకుండా పోతుంది. ఒక వారం రోజులు భార్యాభర్తలు దూరం గా ఉన్నా.. బర్త్ ఒకచోట ఉండి.. భార్య వేరోచోట ఉన్నా కూడా ఆ జంట విడిపోయినట్లు వార్తలు సృష్టిస్తున్నారు. గత కొన్నిరోజులుగా జ్యోతిక ముంబైలో మకాం పెట్టింది. సూర్య మాత్రమే చెన్నైలో ఉండడంతో వీరిద్దరూ విడిపోయారని, త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారని వార్తలు పుట్టించారు. అయితే ఈ ఏడాదే సూర్య ఒక కక్లారిటీ ఇచ్చాడు. పిల్లల చదువుల రీత్యా తాము ముంబైలో ఉంటున్నామని తెలిపాడు. తాను మాత్రం షూటింగ్స్ నిమిత్తం చెన్నై టూ ముంబై తిరుగుతున్నట్లు చెప్పాడు.
ఇక ఈ విడాకుల రూమర్స్ ఎక్కువ కావడంతో జ్యోతిక వీటిపై స్పందించింది. ఇటీవల ఒక మీడియాతో మాట్లాడిన ఆమె తానెందుకు ముంబైలో ఉంటున్నానో చెప్పుకొచ్చింది. తన అమ్మానాన్నలను చూసుకోవడానికి తాను ముంబైలో ఉంటున్నట్లు తెలిపింది. ” సూర్య చాలా మంచి వ్యక్తి. ఆయన నాకెప్పుడూ సపోర్ట్ గా ఉంటారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ప్రస్తుతం ముంబైలో ఉంటున్న మాట నిజమే. అది కేవలం మా అమ్మానాన్న కోసమే. వారు ముంబైలోనే ఉంటారు. వారికి ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదు. ఒక కూతురిగా నేనే వారిని చూసుకోవాలి. వారికోసం మాత్రమే ముంబైలో ఉంటున్నాను. అంతేకాని సూర్యతో విడిపోలేదు” అంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆ పుకార్లకు చెక్ పడినట్లు అయ్యింది. ఇకపోతే ప్రస్తుతం జ్యోతిక సైతం వరుస సినిమాలతో బిజీగా మారింది. సపోర్టివ్ పాత్రలతో అదరగొడుతుంది. త్వరలోనే ఆమె నటించిన కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
Also Read
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
తాజావార్తలు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!