Sudarshan Reddy reply: ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న జస్టిస్ బి.సుదర్‌షన్‌రెడ్డి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్వా జుడుం తీర్పుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఈ అంశంపై హోంశాఖ మంత్రితో చర్చలో పాల్గొనడం తనకు ఇష్టం లేదని అన్నారు. చర్చలో మర్యాద ఉండాలని అన్నారు. సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా, ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌తో పోటీ పడుతున్నారు. శుక్రవారం కొచ్చిలో జరిగిన ఓ సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్‌షా ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణ చేశారు.
సల్వాజుడుంపై నిర్ణయం నాది కాదు, సుప్రీంకోర్టుది..
దేశ ప్రజాస్వామ్యంలో లోటు కనిపిస్తోందని, రాజ్యాంగం కూడా సవాళ్లు ఎదుర్కొంటోందని ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి తెలిపారు. కేంద్ర హోమంత్రి అమిత్ షా విమర్శలపై సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ.. సల్వాజుడుంపై నిర్ణయం తనది కాదని, సుప్రీంకోర్టుదేనని అన్నారు. “కేంద్ర హోంమంత్రితో ఈ విషయంపై నేరుగా చర్చకు దిగాలని అనుకోవడం లేదు. గతంలో ఆ తీర్పు నేనే రాశాను. కానీ, అది నా తీర్పు కాదు.. సుప్రీం కోర్టు ఇచ్చినది. 40 పేజీల ఆ తీర్పును అమిత్ షా చదవాలని ఆశిస్తున్నా. ఒకవేళ అది చదివి ఉంటే ఆ వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదు. ఇదే నేను చెప్పదలచుకున్నా. ఇంతటితో ఈ చర్చను ఆపేద్దాం” అని ఆయన అన్నారు.
సర్వేపై మాట్లాడుతూ…
సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. సామాజిక-ఆర్థిక విధానాలను రూపొందించడానికి కులగణన సర్వే నిర్వహించాలని అన్నారు. నిస్సందేహంగా సవాలును ఎదుర్కొంటున్న భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి తాను ప్రయత్నిస్తానని చెప్పారు. ప్రజాస్వామ్యం అంటే సంభాషణ తప్ప మరొకటి కాదని అన్నారు. ఇది వ్యక్తుల ఘర్షణ కాదు, ఆలోచనల ఘర్షణ అని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఒక లోపం ఉందని అన్నారు. మనం ఇప్పటికీ రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యమే, కానీ ఒత్తిడిలో ఉన్నాము. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదని, రెండు వేర్వేరు భావజాలాల మధ్య పోటీ అని అన్నారు. నా ఏకగ్రీవ అభ్యర్థిత్వం వైవిధ్యాన్ని, ఏకగ్రీవ ఎంపికను, జనాభాలో 64 శాతానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఓటింగ్ శక్తిని సూచిస్తుందని చెప్పారు. జాతీయ అంశాలపై గతంలో అధికార, విపక్ష పార్టీలు సమన్వయం చేసుకునేవి. దురదృష్టవశాత్తు ఇప్పుడది కనిపించడం లేదని అన్నారు.
READ ALSO: Noida dowry murder: నాన్నే అమ్మను లైటర్‌తో కాల్చి చంపాడు… నోయిడాలో దారుణం