Rashmika Mandanna’s Flight Makes Emergency Landing: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ‘యానిమల్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న రష్మిక.. అదే జోషులో పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు మరిన్ని చిత్రాల్లో కూడా నేషనల్ క్రష్ నటిస్తున్నారు. వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్న రష్మికకు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. తృటిలో పెను ప్రమాదం నుంచి ఆమె తప్పించుకున్నారు.
వరుస షూటింగ్‌లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న రష్మిక మందన్న.. తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న ఫైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. దాంతో రష్మిక కంగారు పడిపోయారు. అదే ఫ్లైట్‌లో రష్మికతో పాటు మరో హీరోయిన్ శ్రద్ధా దాస్ కూడా ఉన్నారు. వీరిద్దరు కలిసి ఫ్లైట్‌లో కూర్చున్న ఫోటోను రష్మిక షేర్ చేశారు. ‘ఈ విధంగా ఈరోజు మేము చావు నుంచి తప్పించుకున్నాము’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రష్మికకు ఏమైందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Anjana Bhowmik Death: చిత్రపరిశ్రమలో విషాదం.. సీనియర్ హీరోయిన్ మృతి!
ముంబై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఫ్లైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తిందట. దాంతో ఫ్లైట్ టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత మళ్లీ ముంబైకి తిరిగి వచ్చిందని తెలుస్తోంది. ఈ ఫ్లైట్‌లో రష్మిక మందన్నతో శ్రద్ధా దాస్ కూడా ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇదే విషయాన్ని రష్మిక పోస్ట్ చేశారు.
Rashmika Post