Jupally Krishna Rao : తప్పు చేసిన వాడు ఎప్పుడైనా భయపడతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ కృష్ణా నది జలాల కోసం పోరాటం చేస్తాం అని అంటున్నాడు.. తప్పు చేసిన వాడు ఎప్పుడైనా భయపడతారని.. అందుకే కేసీఆర్ భయపడుతున్నాడని వ్యాఖ్యానించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇవాళ ఆయన గాంధీ భవన్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్.. ఇరిగేషన్ మంత్రి ఐదేళ్లు చేశారని, మామా.. అల్లుళ్లు ఇద్దరు ఇరిగేషన్ మంత్రి గా చేశారని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పరువు నిలబెట్టుకోవడం కోసం ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. పునర్విభజన బిల్లు రాసింది నేనే అని కేసీఆర్ చెప్పాడని, బచావత్ ట్రిబ్యునల్ కి అనుగుణంగా కేటాయింపులు అని రాశారని ఆయన వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో ఉన్న కేసులు ఎందుకు వెనక్కి తీసుకున్నారని, ఎస్‌ఎల్‌బీసీ పాలమూరు ప్రాజెక్టుల పేర్లు కూడా గెజిట్ లో లేవని, మా హక్కులు మాకు కావాలి అని ఎందుకు డిమాండ్ చేయలేదన్నారు జూపల్లి.
Also Read
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
- Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
నిలదీయాల్సిన సమయంలో నిలదీయకుండా.. ఇప్పుడు సభ పెడతా అంటున్నారు కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకున్నది కేసీఆర్ అని ఆయన విమర్శించారు. పైగా ఇప్పుడు మట్లాడుతున్నారని మంత్రి జూపల్లి ఫైర్ అయ్యారు. ప్రజలు శిక్ష వేసినా..బుద్దిరాలేదని జూపల్లి వ్యాఖ్యానించారు. నాటకాలు ఆడటంలో కేసీఆర్ దిట్టా అని, పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి.. నీటి కేటాయింపుల డ్రామా లు వేస్తున్నాడు కేసీఆర్ అని ఆయన అన్నారు. కేసీఆర్ తన పదేళ్ల పాలన సమయంలో పాలమూరు – రంగారెడ్డికి అనుమతులు ఎందుకు తెచ్చుకోలేదు? అని నిలదీశారు. కానీ కాళేశ్వరానికి ఆదరాబాదరాగా అనుమతులు తెచ్చుకున్నారని ఆరోపించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరానికి మాత్రం అనుమతులు తెచ్చారన్నారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే కేసీఆర్ జలవివాదాన్ని ముందుకు తెచ్చారన్నారు.
Ponnam Prabhakar : GHMC అభివృద్ధిపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది
తాజావార్తలు
-
CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
-
YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రాహుల్‌నే ప్రధాని చేయాలి.. వైఎస్సార్‌కు అదే నివాళి
-
Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
-
Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!