NTV Telugu Site icon

Lok Sabha Election 2024: ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరు ఓటేయలి..!

Rahul

Rahul

INDIA bloc: భారత దేశంలో ఈరోజు చివర దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇదిలావుండగా, 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఇక, ఓటర్లను ఉద్దేశించి రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జూన్ 4వ తేదీన భారత దేశానికి పరివర్తన చెందిన క్షణం అని కాంగ్రెస్ నాయకుడు అభివర్ణించారు. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్‌ దేశంలో I.N.D.I.A కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందన్నారు. ఓటర్ల దృఢ సంకల్పంతో ఎండవేడిమిలో కూడా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు మీరంతా ఓటు వేయడానికి ముందుకు వచ్చారన్నారు. పౌరులు నిర్ణయాత్మకంగా ఓటు వేయాలని కోరారు. ఇక, జూన్ 4వ తేదీ నాటికి సూర్యుడు దేశానికి కొత్త ఉదయాన్ని తీసుకు వస్తాడని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు.

Read Also: Amit Shah: కాంగ్రెస్ మెజారిటీ సాధిస్తుందని ప్రచారం చేసింది.. ఎందుకు దూరంగా ఉంటున్నారు..?

కాగా, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని స్పష్టం చేశారు. అలాగే ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు వేయాలని కోరారు. ఏప్రిల్ 19వ తేదీ నుంచి దేశంలో లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి.. ఇప్పటి వరకు ఆరు దశల్లో 486 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరిగిందని ప్రియాంక తెలిపారు.

Read Also: Power Cuts: గమనిక.. నేడు హైదరాబాద్ లో పవర్ కట్..

ఇక, చివరి దశ ఎన్నికలలో భాగంగా నేడు ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలితంలో పోలింగ్ కొనసాగుతుంది. బీహార్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తో పాటు కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌లో ఓటింగ్ జరుగుతున్న ఏడు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఒడిశా రాష్ట్ర అసెంబ్లీలోని మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఏకకాలంలో ఓటింగ్ జరుగుతుంది. చివరి దశ ఓటింగ్‌లో మొత్తం 904 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.