Site icon NTV Telugu

Aadhaar: ఆధార్ కార్డు ఉచిత అప్‌డేట్‌కు ఇంకా కొన్ని రోజులే ఛాన్స్.. త్వరగా చేసుకోండి

Aadhaar

Aadhaar

ఆధార్ అప్ డేట్ చేసుకోని వారికి బిగ్ అలర్ట్. త్వరలోనే ఉచిత గడువు ముగియనున్నది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI పౌరులు తమ ఆధార్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తోంది. అయితే ఈ సౌకర్యం జూన్ 14, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. గడువు లోగా అప్ డేట్ చేసుకుంటే రూ. 50 సాధారణ ఫీజు ఉండదు. ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేయడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాబట్టి మీరు వీలైనంత త్వరగా అప్ డేట్ చేసుకోండి.

Also Read:Pawan Kalyan: సినిమా హాళ్ల బంద్ వెనుక జనసేన వాళ్ళు ఉన్నా వదలొద్దు!

UIDAI యొక్క ఆధార్ నమోదు, అప్ డేట్ నిబంధనలు, 2016 ప్రకారం, ప్రతి ఆధార్ హోల్డర్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తన గుర్తింపు రుజువు, చిరునామా రుజువులను నవీకరించవలసి ఉంటుంది. ప్రభుత్వ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు, బ్యాంక్ ఖాతాను తెరిచేటప్పుడు లేదా KYC ప్రక్రియను పూర్తి చేసేటప్పుడు మీ సమాచారాన్ని నవీకరించడం వలన మీరు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటుంది.

Also Read:SBI CBO Recruitment 2025: SBIలో 3,323 సీబీవో జాబ్స్.. ఇంకా రెండ్రోజులే ఛాన్స్.. వెంటనే అప్లై చేసుకోండి

ఆధార్ కార్డులో ఆన్‌లైన్‌లో ఏమి అప్‌డేట్ చేయవచ్చంటే.. పేరు, పుట్టిన తేదీ (కొన్ని పరిమితుల్లోపు), చిరునామా, లింగం, భాషా ప్రాధాన్యతలు. అయితే, వేలిముద్ర, ఐరిస్ స్కాన్ లేదా ఫోటో కరెక్షన్ వంటి బయోమెట్రిక్ నవీకరణల కోసం, మీరు ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించాలి.

Also Read:Pawan Kalyan: సినిమా హాళ్ల బంద్.. జనసేన నేతకు పవన్ షాక్?

ఉచిత ఆధార్ అప్ డేట్ కోసం ముందుగా https://myaadhaar.uidai.gov.in పోర్టల్ లోకి వెళ్లాలి.. ఇందులో మొదట మీ ఆధార్ కార్డు నెంబర్ నమోదు చేసి లాగిన్ కావాలి.. ఆ తర్వాత Online Update Services పైన నొక్కాలి.. తద్వారా Update Aadhaar Online పైన క్లిక్ చేసి Proceed to Update Aadhaar పైన క్లిక్ చేసి పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆప్షన్స్‌లో మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని.. మీ డీటెయిల్స్ నమోదు చేసుకోవాలి. డబ్బులు అవసరం లేకుండా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయాలి. అప్పుడు అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్ ఎస్ఎంఎస్‌ రూపంలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వస్తుంది.

Exit mobile version