Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story July 3 Was Worlds Hottest Day Ever As Global Temperatures Rise

World Hottest Day: భూమిపైనే అత్యంత వేడి రోజు.. ఉష్ణోగ్రత ఎంతో తెలుసా?

Published Date :July 5, 2023 , 4:29 pm
By Mahesh Jakki
World Hottest Day: భూమిపైనే అత్యంత వేడి రోజు.. ఉష్ణోగ్రత ఎంతో తెలుసా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

World Hottest Day: భూమిపైనే అత్యంత వేడి రోజుగా జులై 3 రికార్డును నమోదు చేసింది. ఈ విషయాన్ని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ శాఖ తెలిపింది. జులై 3వ తేదీన భూఉపరితలానికి 2 మీటర్ల ఎత్తులోని గాలి సగటు ఉష్ణోగ్రత 62.62 డిగ్రీల ఫారెన్‌హీట్ లేదా 17.01 సెల్సియస్‌కు చేరుకుందని వెల్లడించింది. ఈ వివరాలు మైనే యూనివర్సిటీ అధ్యయనంలో తెలిసినట్లు చెప్పింది. ఫలితంగా 2022 జులై, 2016 ఆగస్టులో నమోదైన 62.46 డిగ్రీల ఫారెన్‌హీట్ రికార్డు బద్దలైందని వివరించింది. వాయవ్య కెనడా, పెరూ, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొంది.

దక్షిణ అమెరికా ఇటీవల ఎండల్లో మగ్గిపోతోంది. ఎండల వేడిని తట్టుకోలేక ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. చైనాలో 35C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో తీవ్రమైన ఎండలు కొనసాగాయి. ఉత్తర ఆఫ్రికాలో 50C సమీపంలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే అంటార్కిటికాలో ప్రస్తుతం శీతాకాలం నడుస్తోంది. అయినప్పటికీ.. అసాధారణంగా అధిక ఉష్ణోగ్రతలను నమోదు చేసింది. శ్వేత ఖండంలోని అర్జెంటీనా దీవులలో, ఉక్రెయిన్ వెర్నాడ్‌స్కీ రీసెర్చ్ బేస్ ఇటీవల 8.7C (47.6F)తో జూలై ఉష్ణోగ్రత రికార్డును బద్దలు కొట్టింది.

Also Read: Tamilnadu: ఇకపై అతిథుల డ్రైవర్లకు హోటళ్లలో వసతి, బాత్‌రూమ్‌లు తప్పనిసరి

ఇది మనం గొప్పగా చెప్పుకోవాల్సిన మైలు రాయి కాదని బ్రిటన్ ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లోని గ్రాంథమ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్‌మెంట్‌కు చెందిన వాతావరణ శాస్త్రవేత్త ఫ్రెడెరిక్ ఒట్టో అన్నారు. అలాగే ఇది ప్రజలకు, పర్యావరణ వ్యవస్థలకు మరణ శిక్ష లాంటిదని కామెంట్ చేస్తున్నారు. వాతావరణ మార్పు, ఎల్‌నినో దీనికి కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. దురదృష్టవశాత్తుగా పెరుగుతున్న ఎల్‌నినోతో పాటు పెరుగుతున్న (కార్బన్ డయాక్సైడ్), గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలతో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల్లో ఇది మొదటి దశగా చెబుతున్నారు.

ఎల్​ నినో అంటే తెలుసా?
పసిఫిక్‌ మహా సముద్రంలో వేడి నీటి పరిస్థితులను తొలిసారిగా 16వ శతాబ్దంలో పెరూ, ఈక్వెడార్‌ తీరప్రాంత జాలరులు గుర్తించారు. సముద్రపు నీరు వేడెక్కినప్పుడు చేపలు తక్కువగా పడుతున్నట్టు, ఇది క్రిస్‌మస్‌ సమయంలో ఎక్కువగా ఉంటున్నట్టు గమనించారు. దీనికి వారు పెట్టుకున్న పేరు ‘ఎల్‌నినో డి లా నేవిడాడ్‌’. అంటే ‘ద క్రిస్‌మస్‌ చైల్డ్‌’.. అనగా బాల ఏసు అని అర్థం. ఆ తర్వాత 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం మొదట్లో శాస్త్రవేత్తలు వివిధ దేశాల్లో సంభవిస్తున్న మార్పులకు కారణమేంటనేది తెలుసుకోవటం మీద దృష్టి సారించారు. చివరకు ఇవి ఆయా ప్రాంతాలతో ముడిపడినవి కావని.. ఎల్‌నినో ప్రభావంతోనే ఏర్పడుతున్నాయని 20వ శతాబ్దంలో గుర్తించారు. ఇది సగటున 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుందని తెలుసుకున్నారు. అయితే ఇదేమీ కచ్చితమైన వ్యవధి కాదు. కొన్నిసార్లు రెండేళ్లకూ, మరికొన్ని సార్లు 7 సంవత్సరాలకూ ఏర్పడొచ్చు. సాధారణంగా ఇది 9-12 నెలల పాటు కొనసాగుతుంది. కానీ కొన్నిసార్లు ఏళ్ల కొద్దీ ఉండొచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • america
  • china
  • Climate
  • Global Temperatures
  • Hottest Day

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions