NTV Telugu Site icon

NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై జ్యుడీషియల్ విచారణ జరపాలి.. రామకృష్ణ డిమాండ్‌

Cpi Ramakrishna

Cpi Ramakrishna

NEET Paper Leak: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.. రూ.30 లక్షలకు నీట్ ప్రశ్నాపత్రం అమ్మటం వైద్య విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటమేనని మండిపడ్డారు.. బీహార్ కు చెందిన ముఠా ఒక్కో విద్యార్థి నుండి రూ. 30 లక్షలు తీసుకొని పేపర్ లీకేజీ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నడూ లేని విధంగా దాదాపు 67 మందికి 720/720 మార్కులు వచ్చాయి. 720 మార్కులు సాధించిన ఆరుగురు విద్యార్థులు హర్యానాలోని ఒకే ఎగ్జామ్‌ సెంటర్ నుండి పరీక్ష రాశారు. నీట్ అక్రమాలకు కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేవారు.. నీట్ వ్యవహారంలో అక్రమార్కులపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు రామకృష్ణ.

Read Also: Pakistan Team: టీ20 ప్రపంచకప్‌ కోసం చెత్త జట్టును ఎంపిక చేశారు: పాక్‌ మాజీ క్రికెటర్

కాగా, నీట్ యూజీ ప్రవేశ పరీక్ష 2024లో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.. నీట్ పేపర్‌ను లీక్ చేసేందుకు.. అభ్యర్థుల నుంచి ఏకంగా రూ.30 లక్షల చొప్పున నిందితులు తీసుకున్నట్లు బయటపడింది.. బీహార్‌లో చేపట్టిన దర్యాప్తులో ఈ సంచలన విషయాలు తెలిశాయి.. దీంతో, నీట్ ఆశావహులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మాత్రం.. నీట్ పరీక్షలో ఎలాంటి అక్రమాలు జరగలేదని చెబుతున్నాయి.. మరోవైపు NEET- 2024 పేపర్ లీకేజీ అంశంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)తో పాటు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.. నీట్ పరీక్ష వ్యవహారంలో 0.001 శాతం నిర్లక్ష్యం వహించినా దాన్ని పూర్తిగా పరిష్కరించాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.