NTV Telugu Site icon

Arvind Kejriwal: రేపు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పు..

Kejriwal

Kejriwal

లిక్కర్ సీబీఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై రేపు తీర్పు వెలువడనుంది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పును జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం వెలువరించినుంది. కాగా.. ఇంతకుముందు ఢిల్లీ లిక్కర్ సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.. గతవారం కేజ్రీవాల్ పిటిషన్ పై సుదీర్ఘంగా వాదనలు సాగాయి. ఇంకా ఏమైనా వాదనలు వినిపించాల్సి ఉంటే, లిఖిత పూర్వకంగా కోర్టుకు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో.. కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. సిబీఐ తరపున ఎస్వీ రాజు (అడిషనల్ సొలిసిటర్ జనరల్) వాదనలు వినిపించారు. ఈ క్రమంలో.. ఈ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వద్దంటూ సీబీఐ వాదనలు వినిపించింది. దీంతో.. ఆగస్టు 5న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కాగా.. లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కేజ్రీవాల్ జూన్ 26న అరెస్ట్ అయ్యారు.

Read Also: Nunakkhuzhi: తెలుగులోకి జయ జయహే హీరో సినిమా.. ఏ ఓటీటీలో ఎప్పటి నుంచి చూడాలంటే?

కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది మాట్లాడుతూ.. కేవలం వాంగ్మూలం ఆధారంగా కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని.. అరెస్టులను నియంత్రించడం కోసమే సీఆర్పీసీలో సెక్షన్ 41(ఏ)ను 2010లో చేర్చారని సింఘ్వీ తెలిపారు. ఈ సెక్షన్ ప్రకారం అరెస్టు చేయాల్సిన అవసరం ఉండదని.. ఎప్పుడు అవసరమైతే అప్పుడు విచారణకు పిలిపించవచ్చని పేర్కొన్నారు. మరోవైపు.. కేజ్రీవాల్ అరెస్ట్ చట్టబద్ధంగా జరిగిందని సీబీఐ తరుఫు న్యాయవాది తెలిపారు. కేజ్రీవాల్ హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించలేదని అన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ కి సంబంధించి ట్రయల్ కోర్టు అనుమతి తీసుకున్నామని.. ట్రయల్ కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ ద్వారా అరెస్ట్ కి గల కారణాలు తెలిపామని పేర్కొన్నారు. కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా చార్జ్ షీట్ దాఖలైందని సీబీఐ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని.. ఛార్జ్ షీట్ చూడకుండా, ట్రయల్ కోర్టు బెయిల్ పై విచారణ జరపకుండా సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం సరికాదని అన్నారు. ఢిల్లీ కేసుకు పంజాబ్ లింక్ కూడా ఉంది.. ఇంకా విచారణ జరపాల్సి ఉందని సీబీఐ తరుఫు న్యాయవాది పేర్కొన్నారు.

Read Also: Raghu Thatha: ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్ ‘రఘు తాత’.. ఎప్పుడు? ఎక్కడ చూడాలంటే?

Show comments