Site icon NTV Telugu

Maganti Gopinath: సినీ నిర్మాతగా మాగంటి గోపీనాథ్.. ఈ నాలుగు సినిమాలు సక్సెస్ కాకపోవడంతో..

Maganti Gopinath1

Maganti Gopinath1

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఈ రోజులు ఉదయం కన్నుమూశారు. మాగంటి రాజకీయాల్లోకి రాకముందు సినీ నిర్మాతగా నాలుగు చిత్రాలు నిర్మించారు. అదృష్టం కలిసిరాకపోవడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. కానీ ప్రొడ్యూసర్ గా సక్సెస్ కాలేకపోయిన ఆయన రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. మాగంటి గోపీనాథ్ సినిమా నేపథ్యాన్ని పరిశీలిద్దాం.. గోపీనాథ్ నాలుగు చిత్రాలు నిర్మించారు. 1995లో ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో ‘పాతబస్తీ’ చిత్రాన్ని తెరకెక్కించారు. నిర్మాతగా ఇది మొదటి సినిమా. సురేశ్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు.

READ MORE: Pooja Hegde : నా జీవితంలో కొత్త ప్రయాణం మొదలైంది..

పాతబస్తీ సినిమా ప్రజాధారణ పొందలేక పోయింది. 2000లో రాజశేఖర్ హీరోగా ‘రవన్న’ సినిమా నిర్మించారు. ఈ సినిమాకు బి.గోపాల్ దర్శకత్వం వహించారు. సౌందర్య నాయికగా తెరకెక్కిన ఈ సినిమా సైతం జనాన్ని ఆకట్టుకోలేక పోయింది. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్‌ను పరిచయం చేస్తూ ఒకే రోజున తొమ్మిది సినిమాలు మొదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మాగంటి నిర్మాతగా ఓ సినిమా రూపొందించారు. అదే భద్రాద్రి రాముడు మూవీ. 2004లో విడుదలైన ఈ సినిమాకు సురేశ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కూడా ప్రేక్షకుల ముందు నిలదొక్కుకోలేక పోయింది. మరోసారి రాజశేఖర్ తో 2009లో ‘నా స్టైలే వేరు’ సినిమా తెరకెక్కించారు. జి. రామ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భూమిక నాయికగా నటించారు. ఇది కూడా గోపీనాథ్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. అలా నిర్మాతగా సక్సెస్ కాలేకపోయారు. కానీ రాజకీయంలో మాత్రం రాణించారు.

READ MORE: Benefits of Fish: మృగశిర కార్తె రోజే చేపలు ఎందుకు తింటారు? ఎన్ని లాభాలో తెలుసా?

Exit mobile version