ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ టీడీపీ నేతలతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. కూటమి అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని సీఎం నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ స్థానిక ఎన్నికలపైనా సీఎం చంద్రబాబు నేతలతో చర్చించినట్లు సమాచారం. ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా టీడీపీ కూడా దూకుడు పెంచింది.
Also Read: Vizag CP: అందుకే.. వైఎస్ జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వలేం!
సీఎం చంద్రబాబు వద్దకు అరవింద్ కుమార్ గౌడ్, బక్కని నర్సింహులు వెళ్లారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయాలా? లేదా బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలా? అనే దానిపై మంతనాలు జరిగినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్లో పోటీ చేద్దామని టీడీపీ నేతలు అంటున్నారట. బీజేపీతో పొత్తు ఉన్న కారణంగా సీఎం చంద్రబాబు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకొలేదని సమాచారం. టీడీపీతో కలిసి వెళ్లేందుకు తెలంగాణ బీజేపీ నేతలు సముఖంగా లేనట్టు తెలుస్తోంది. ఏదేమైనా త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.