NTR Promise: ఇది ఎన్టీఆర్ అంటే.. ఈ ప్రామిస్ అంతకుమించి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ లెవల్లో ఉంది. అయితే దశాబ్దం క్రితం ఈ క్రేజ్ లేదు. 19 ఏళ్ల విషయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఎన్టీఆర్.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. ఆ తర్వాత మూడున్నర ఏళ్ల పాట్టు హిట్ అనే మాటే లేదు. అలాంటి సమయంలో 2015లో ఎన్టీఆర్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘టెంపర్’ సినిమా వచ్చింది. ఈ సినిమా ఆడియో లాంచ్‌లో ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్ ఈ రోజుకి కూడా ఫ్యాన్స్‌కి గుర్తుండే ఉంటుంది. ఇక నుంచి ‘నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసుకునే సినిమాలు చేస్తాను’ అని ప్రామిస్ చేశాడు. చెప్పినట్టే టెంపర్ సినిమా నుంచి కొత్త ఎన్టీఆర్‌ను ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నందమూరి అభిమానులు ఎత్తిన కాలర్ని దించకుండా చేశాడు.
తాజాగా మరోసారి అలాంటి ప్రామిస్నే ఎన్టీఆర్ చేశాడు. ‘టిల్లు స్క్వేర్’ సినిమా సక్సెస్ మీట్‌కి వచ్చిన ఎన్టీఆర్.. ‘దేవర’ సినిమా గురించి మాట్లాడాడు. ఎన్టీఆర్ చెప్పిన మాటలను బట్టి.. మరో ప్రామిస్ చేశాడనే చెప్పాలి. ఒక్క మాట.. ఒకే ఒక్క మాట.. కొంచెం ఓవర్ అయిందని అనుకోకపోతే చిన్న విషయం చెబుతాను.. ఈరోజు చొక్కా వేసుకొని వచ్చాను.. చొక్కాకి కాలర్ ఉంటుంది.. దేవర అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే, రేపు పొద్దున మీరందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలా ఉంటుందని చెప్పాడు. ఈ ఒక్క మాటతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది.
Also Read
- Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
- Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
- Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
- AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
Also Read: Preity Zinta Photoshoot: ఫస్ట్ ఫోటోషూట్ పిక్ షేర్ చేసిన ప్రీతి జింటా.. ఎంత ముద్దుగా ఉందో!
‘బింబిసార’ ఈవెంట్లో దేవర అప్డేట్ అడిగితే.. అభిమానులపై ఎన్టీఆర్ కాస్త కోప్పడ్డాడు. అప్టేట్స్ ఏదైనా ఉంటే తనే చెబుతానని చెప్పాడు. కానీ ఈసారి మాత్రం అడక్కుండానే దేవర కాలర్ ఎగరేసేలా ఉంటుందని.. టెంపర్ టైంలో ప్రామిస్ చేసినట్టుగా చేశాడు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎనర్జీకి కొలమానం లేకుండా పోయింది. ఈసారి ప్రామిస్ అంతకుమించి అని.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. చెప్పినట్టుగా అక్టోబర్ 10న దేవర సినిమాతో మళ్లీ బాక్సాఫీస్‌పై టైగర్ దండయాత్ర చేస్తాడు. అంతేకాదు వెయ్యి కోట్ల సినిమా ఇచ్చి 2024ని దేవర నామ సంవత్సరంగా మార్చనున్నాడు. ఇక వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలతో ఫ్యాన్స్ డబుల్ కాలర్ ఎగరేసేలా చేయడం గ్యారెంటీ.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!