Preity Zinta Photoshoot: ఫస్ట్ ఫోటోషూట్ పిక్ షేర్ చేసిన ప్రీతి జింటా.. ఎంత ముద్దుగా ఉందో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Preity Zinta’s 1st Photo from her first photoshoot: ‘ప్రీతి జింటా’.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. యాపిల్ బ్యూటీగా, డింపుల్ గర్ల్‌గా కుర్రాళ్ల మదిలో చెదరని ముద్ర వేశారు. 1998లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘దిల్ సే’తో తెరంగేట్రం చేసిన ప్రీతి.. కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా బాలీవుడ్‌ను ఏలారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సొట్టబుగ్గల సుందరి ప్రీతి.. ఐపీఎల్ 2024తో బిజీగా గడుపుతున్నారు. అయితే ప్రీతి జింటా తాజాగా తన కెరీర్ ప్రారంభ రోజులలోని ఓ ఫోటోషూట్ పిక్ అభిమానులతో పంచుకున్నారు.
ప్రీతి జింటా తన మొదటి ఫోటోషూట్ నుండి ఓ చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆమె ఆ పోస్ట్‌కు క్యాప్షన్ కూడా ఇచ్చారు. ‘నేను కొన్ని పాత ఫొటోస్ చూస్తున్నాను. ఈ ఫోటో నా కంట పడింది. ఓ మై గాడ్.. ఇది నా మొదటి ఫోటోషూట్‌కు సంబందించినది. నాకు అప్పుడు 20 ఏళ్లు. ఫోటోషూట్‌కి ఎలా పోజులివ్వాలో తప్ప.. ప్రపంచం గురించి ప్రతిదీ నాకు తెలుసు అని అనుకున్నాను’ అని పేరొన్నారు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ‘ప్రీతి.. ఎంత ముద్దుగా ఉందో’ అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
- AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
- Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
Also Read: Pushpa 2 Teaser: 12 గంటల్లోనే 51 మిలియన్స్.. నీయవ్వ ‘తగ్గేదేలే’!
ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు సినిమాల్లో నటించి.. తెలుగు ప్రేక్షకుల మది కూడా సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా దోచారు. 49 ఏళ్ల ప్రీతి 2016లో జీన్ గూడెనఫ్‌ను వివాహం చేసుకున్నారు. అమెరికాకు చెందిన హైడ్రోఎలక్ట్రిక్ పవర్ సంస్థలో ఫైనాన్స్ ఉపాధ్యక్షునిగా జీన్ పనిచేస్తున్నారు. జీన్, ప్రీతిలో సరోగసి విధానంలో కవల పిల్లలు ఉన్నారు.
తాజావార్తలు
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
-
New Mahindra Thar OG: కొత్త Mahindra Thar OG భారత్‌లో లాంచ్.. 2.2L డీజిల్, 2.0L టర్బో పెట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
-
Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ట్రెండింగ్
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..