టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా అయ్యాడు.. అదే జోష్ లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాను చేస్తున్నారు ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఇప్పటికే రిలీజ్ అయిన ఫోటోస్, గ్లింప్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ ఏడాదిలోనే దేవర చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే కొన్ని నెలలుగా ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..
అయితే ఈ సినిమా షూటింగ్ కు ఎన్టీఆర్ బ్రేక్ ఇవ్వనున్నాడు.. ఈ సినిమా తర్వాత వార్ 2 సినిమా లో నటిస్తున్నారు.. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ముంబైకు వెళ్లారు.. దాదాపు నెల రోజులు అక్కడే షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.. హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్ అబ్రహం, కియారా అద్వానీ, శార్వరి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ ఓ పాత్రలో నటిస్తున్నారు..
ఈ తారక్ సినిమాలో నెగిటివ్ రోల్ చేయబోతున్నారు.. వార్ 2 కోసం తారక్ 60 రోజులు డేట్స్ ఇచ్చారట. వీటిలో 30 రోజులు తన సోలో సీన్స్ కోసం.. మరో 30 రోజులు హృతిక్ తో కలిసి సీన్స్ చేయనున్నారట.. ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్ పాత్రలో నటిస్తున్నారని సమాచారం.. వచ్చే ఏడాది ఆగస్ట్ 14న ఈ ను రిలీజ్ చేయనున్నారు.. ఆ తర్వాత ఎన్టీఆర్ వరుసగా తెలుగు సినిమాల పై ఫోకస్ చెయ్యనున్నారు..