Site icon NTV Telugu

Budget : అదానీ వ్యవహారంపై విపక్షాల ఆందోళన.. మధ్యాహ్నం 2 గంటలకు లోక్ సభ వాయిదా

Lok Sabha

Lok Sabha

ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం నెలకొనడంతో ఒక రోజు వాయిదా పడిన రాజ్యసభ, లోక్ సభలు తిరిగి ప్రారంభం అయ్యాయి. అయితే మరోసారి గౌతమ్ అదానీ- హిడెన్ బర్గ్ వ్యవహారంపై జేపీసీ ( జాయింట్ పార్లమెంటరీ కమిటీ ) విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా.. స్పీకర్ ఓంబిర్లా లోక్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. గత వారం లండన్ లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే మరోసారి లోక్ సభ సమావేశాలను వాయిదా పడ్డాయి.

Also Read : MLC Kavitha: ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ.. ఆ.. విషయంపై ప్రశ్నల వర్షం

అదానీ-హిడెన్ బర్గ్ వ్యవహారంలో జేపీసీ విచారణకు డిమాండ్ చేస్తూ విపక్షాల ఆందోళనల మధ్య లోక్ సభ స్పీకర్ నేటి సమావేశాలను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. బడ్జెట్ 2023 మొదటి భాగం మాదిరిగానే సెకండ్ హాప్ లో కూడా అంతరాయాలతో ముందుకుసాగుతుంది. నిన్న కూడా అధికార-విపక్షాల మధ్య తీవ్ర నిరసనలు చేయడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. ఇవాళ్టీ సమావేశాల్లోనూ తమ డిమాండ్లను కొనసాగిస్తూ, ప్రతిపక్ష నాయకులు అదానీ వ్యవహారంపై వి వాంట్ జేపీసీ అంటూ నినాదాలు చేశారు. వెంటనే దీనిపై విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేశారు. రాజ్యసభలో అదానీ-హిడెన్ బర్డ్ సమస్యపై చర్చను రాజ్యసభ ఛైర్మన్ తిరస్కరించారు. అంతకుముందు, పార్లమెంట్ లోని మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలతో ఆయన సమావేశం అయ్యారు సభాలో తమ గొంతుకలను వినిపించేందుకు వ్యూహాలు రూపొందించారు.

Also Read : Gudivada Amarnath:అవినీతిలో నోబెల్., నటనలో ఆస్కార్ చంద్రబాబుకే

లండన్ లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అయితే రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పరని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. మాకు సమాధానం లభించే వరకు అదే డిమాండ్ ను పదేపదే అడుగుతామంటూ ఆయన పేర్కొన్నారు. ఇది సమస్య నుంచి పక్కదారి పట్టడం మాత్రమే.. మన రాయబార కార్యాలయాలపై దాడులు జరుగుతున్నా.. ఈ దాడులను ఖండిస్తూ ఏమీ మాట్లాడటం లేదన్నారు. వీరు మెహుల్ చోక్సీకి రక్షణ కల్పించారని.. ఇప్పుడు దేశభక్తి గురించి మాట్లాడుతున్నారని మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు.

Exit mobile version