Site icon NTV Telugu

Jagadambika Pal : ‘వక్ఫ్ చట్టంలో ఏదైనా తప్పు కనిపిస్తే, రాజీనామా చేస్తా’

Jagadambika Pal

Jagadambika Pal

వక్ఫ్‌ (సవరణ) చట్టం-2025 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 72 పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వక్ఫ్‌పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. కాగా.. సవరణలోని వివిధ అంశాలకు సంబంధించి పిటిషన్లలో అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఈ అంశపై తాజాగా వక్ఫ్ చట్టంపై ప్రశ్నలు లేవనెత్తే వారి కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ జాయింట్ కమిటీ (జెపిసి) ఛైర్మన్ జగదాంబికా పాల్ స్పందించారు.ఈ చట్టంలో ఒక్క తప్పు తేలితే, తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

READ MORE: Minister Anam Ramanarayana Reddy: టీటీడీని అపవిత్రం చేసేందుకు వైసీపీ నేతల యత్నం..! మంత్రి ఆనం ఫైర్‌

జాతీయ మీడియా సంస్థ “ఆజ్ తక్‌”తో జగదాంబికా పాల్ తన భావాలను పంచుకున్నారు. “రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇలా చేస్తున్నాయి. ముస్లింలను సంతృప్తిపరిచే రాజకీయాలు సరికాదు. నేను ఎలాంటి రాజకీయాలతో ప్రేరణ పొందలేదు. పూర్తి నిష్పాక్షికతతో పనిచేస్తున్నాను. వక్ఫ్ సవరణ బిల్లుకు ముందు బీజేపీ 38 సమావేశాలు నిర్వహించింది, అన్ని ప్రశ్నలు నిరాధారమైనవి. కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి. ” అని ఆయన స్పష్టం చేశారు.

READ MORE: HP Omen Max 16: HP నుంచి కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌ విడుదల.. రూ. 10 వేల క్యాష్ బ్యాక్

సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో కొత్త బిల్లు ప్రకారం.. వక్ఫ్ బోర్డులో హిందువులను ఎలా చేరుస్తారనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. దీనికి సంబంధించిన ప్రశ్నలను సుప్రీంకోర్టు కూడా లేవనెత్తింది. ముస్లింలను హిందూ సంస్థలలోకి అనుమతిస్తారా? అని ప్రశ్నించింది. ఈ అంశంపై స్పందించిన జగదంబికా పాల్.. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుల ఉనికిని ఇప్పటికే నిర్ణయించామని చెప్పారు. వక్ఫ్ బోర్డు ఒక చట్టపరమైన సంస్థ.. మతపరమైన సంస్థ కాదని జగదంబికా పాల్ స్పష్టం చేశారు.

Exit mobile version