NTV Telugu Site icon

JP Nadda : మోడీ దేశంతోపాటు తెలంగాణ అభివృద్ది కోసం ఎంతో చేశారు

Jp Nadda

Jp Nadda

నాగర్ కర్నూల్ బీజేపీ నవ సంకల్ప యాత్ర బహిరంగ సభకు పార్టీ జాతీయ అద్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి,మహేంద్రనాథ్ పాండే.. డీకే అరుణ.. జితేందర్ రెడ్డి ఈ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ తొమ్మిది ఏళ్ళ పాలనపై మాట్లాడేందుకు ఇక్కడికి వచ్చినందుకు సంతోషమన్నారు. జోగులాంబ అమ్మవారు.. ఉమామహేశ్వర స్వామీ ని తలుచు కుంటున్నానని, ఇక్కడ తెలంగాణ వెనకబడింది.. కానీ ఒక్క సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రం ముందుకు సాగింది. ఇది చాలా బాధాకరమన్నారు.

అంతేకాకుండా.. ‘తెలంగాణా ను సీఎం కేసీఆర్ పూర్తిగా వెనక్కి నెట్టేసినా… ప్రధాని మోడీ.. పాలన వల్ల మొత్తం దేశం తో కలసి తెలంగాణా అభివృద్ది పథాన నడుస్తుంది.. దీనికి నాకు చాలా సంతోషంగా ఉంది. మోడీ పాలనలో పేద.. రైతు మహిళ వంచిత..యువత స్వశక్తి కోసం చేస్తుంది. మోదీ పలనాలో.. దేశంలో 80 కోట్ల మందికి ఐదుకిలోల బియ్యం.. ఐదు కిలోల ఉచితంగా ఇస్తున్నాం. ఇది ఐరోపా జనాభా కన్నా ఎక్కువ. దేశంలో పేదరికం 22 శాతం నుంచి 10 శాతానికి పరిమితం అయ్యింది. అత్యంత నిరుపేదలు ఒక శాతం కన్నా తక్కువగా ఉన్నారు. ప్రధాన మంత్రి అవాస్ యోజనను కూడా ఇక్కడ 2BHK పేరుతో కుంభకోణం జరిగింది. అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపాలా వద్దా.. దేశంలో పేదలకు ఇళ్లు నిర్మాణం నాలుగు కోట్ల మందికి ఇచ్చాం.. ఇది ఆస్ట్రేలియా దేశ జనాభా కంటే ఎక్కువ. దేశంలో ఎన్నో పథకాల ద్వారా అందరి అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం పాటు పడుతుంది. కరోనా తర్వాత.. ఉక్రెయిన్ యుద్ధం తర్వత ప్రపంచం మొత్తం ఆర్థికంగా వెనుకబడిగా.. మన దేశం మాత్రమే ముందుకు సాగింది.. పడవ స్థానం నుంచి ఐదవ స్థానంలోకి ఎగ బాకింది. మొబైల్ ఫోన్లు ఇపుడు 97 శాతం మన దేశంలోనే తయారు ఔతున్నయి. ఇంతకు ముందు మన ప్రధాని అమెరికా వెళితే.. పాకిస్తాన్.. టెర్రరిజం లాంటి అంశాల పై చర్చ జరిగేది.

ఇపుడు మన మోడీ అమెరికా వెళితే అలాంటి చర్చలున్నయా.. ఇవ్వాళ్ళ ప్రధాన మంత్రి మోడీ అమెరికా.. ఈజిప్ట్ నుంచి తిరిగి వస్తున్నారు.. నేడు మోడీకి ఈజిప్టు సర్వొత్త పురస్కారం దక్కింది.. కానీ ఇక్కడి ప్రతిపక్ష పార్టీ నరేంద్ర మోడీని నీచంగా మాట్లాడుతున్నారు. మోడీ దేశంతోపాటు తెలంగాణ అభివృద్ది కోసం ఎంతో చేశారు. గత పర్యటనకు వచ్చినపుడు 13 వేల కోట్ల రూపాయల అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణాలో 5వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఇచ్చారు. ఇది హైదరబాద్ నుంచి లడాక్ కు రెండు సార్లు వచ్చేదానితో సమానం. రైళ్లు.. జాతీయ రహదారి.. మెట్రో.. ఎలివేటెడ్ రోడ్స్.. ఇలా ప్రతీ అభివృద్ది పనులు చేస్తున్నాడు.
రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు కేంద్ర ప్రభుత్వ సహకారం వల్లే. నిన్న పాట్నా లో ప్రతిపక్షాలు ఫోటో సెషన్ నిర్వహించాయి. కుటుంబ పాలన వాదులు కలిశారు.. వారివారి కుటుంబాలను రక్షించుకొనుట కోసం చేశారు.. మోడీ మాత్రం దేశాన్ని రక్షించేందుకు పని చేస్తున్నారు. దేశాన్ని ముందుకు నడపాలంటే బీజేపీకి సహకరించండి. పేరు మారితే నీతి మారదు.. సీఎం కేసీఆర్ కుటుంబం కాపాడాలంటే.. ఆయన కొడుకును.. అల్లుడిని.. బిడ్డను కాపాడాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయండి.. అభివృద్ది కావాలంటే బీజేపీ ని గెలిపించండి. బీఆర్‌ఎస్‌ అంటే బ్రస్టాచార్ రాక్షసుల సమితి. ధరణీ సీఎం కేసీఆర్ జేబు నింపే పోర్టల్. బీజేపీ అధికారంలోకి వస్తే ధరణీ పోర్టల్ ను రద్దు చేస్తుంది.’ అని జేపీ నడ్డా అన్నారు.