NTV Telugu Site icon

JP Nadda : దేశం బాగుండాలంటే కేవలం బీజేపీ వల్ల మాత్రమే సాధ్యం

Jp Nadda

Jp Nadda

మహబూబాబాద్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమ్మక్క సారాలమ్మ కు.. రామప్ప రామలింగేశ్వర స్వామి వార్లకు నమస్కారించి స్పీచ్ ప్రారంభించిన నడ్డా మాట్లాడుతూ.. ఇంత ఎండలో కూడా మీరు ఈ సభకు తరలి వచ్చిన మీ ఉత్సాహం చూస్తుంటే వినోద రావు , సీతారాం నాయక్ కు గొప్ప విజయం చేకూరుతుందని ఆశిస్తున్నానన్నారు. దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి, దేశం బాగుండాలంటే కేవలం బిజెపి వల్ల మాత్రమే సాధ్యమని, ముఖ్యంగా ఈరోజు దేశం లో శక్తి వంతమైన నాయకుడు మోడీ, ఈ ఎన్నికల్లో మీ ముందు కు వచ్చే మా అభ్యర్థులను మీరు ఆశీర్వదించాలన్నారు. అయోధ్య రామ మందిరాన్ని నిర్మించింది మీరు కళ్ళారా చూశారని, ఒక శక్తి వంత మైన ప్రభుత్వం రావాలంటే కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలను కాకుండ బలమైన బిజెపి లాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నారు జేపీ నడ్డా. ముఖ్యంగా గిరిజనుల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమని ఆయన అన్నారు. ఆర్థికంగా భారత దేశం బలపడుతుంది, భారత దేశాన్ని 11వ స్థానం నుండి 5వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత మోడీది అని, దేశం లోనే పేదరిక నిర్మూలన కోసం గత 10సంవత్సరాలనుండి పాటు పడుతుంది కేవలం బీజేపీ పార్టీ మాత్రమే అని ఆయన అన్నారు.

అంతేకాకుండా..’ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో భారత దేశం ముందుకెళుతుంది… ఆటో మొబైల్ రంగాల్లో జపాన్ ముందు వరుసలో వుండే కానీ ఆటో మొబైల్ రంగం లో కూడా మేక్ ఇన్ ఇండియా పేరు మీద ముందు వరుసలో ఉన్నాం.. దేశం లో అనేక మార్పులు వస్తున్నాయి, మోడీ గత పది సంవత్సరాల్లో మహిళలు, రైతులు, విద్యార్థులు, గ్రామాల గురించి, తల్లుల కోసం అన్ని పథకాలను అందీంచిన ప్రభుత్వం మాది.. రాబోయే 5 సంవత్సరాల్లో 7 కోట్ల కుటుంబాలకు గ్యాస్ అందించే పథకాన్ని మా ప్రభుత్వం చేపట్టింది.. తెలంగాణ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం నుండి 3వంతుల ఆర్థిక సహాయం అందింది….రైల్వే స్టేషన్లను కు సుందరీకరిస్తున్నము.. మోడీ రాకముందు కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసింది. కుల రాజకీయాలను పెంచింది. మోడీ వచ్చిన తరువాత వీటన్నింటి చెక్ పడింది. వారసత్వ రాజకీయాలకు తెర పడింది. అభివృద్ధికి బాటలు పడ్డాయి. పని తీరును బట్టి ఓట్లు వేస్తున్నారు. పాకిస్తాను నుండి కాల్పులు జరిపితే కాంగ్రెస్ పట్టించుకోలేదు. కానీ మోడీ సర్జికల్ స్ట్రిక్ చేసి భారత్ సత్త చాటారు. మోడీ సర్కార్ లో ఆదివాసీల తయారీ చేసే ఉత్పత్తులకు mspi ధర వచ్చేలా చట్టాలు తీసుకున్నాం. గిరిజన యూనివర్సిటీ ఏర్పటు చేశాము. బంజారా సామాజిక వర్గం అభివృద్ధి నిధులు ఇచ్చాము. భద్రాచలం వరకు నేషనల్ రోడ్డు విస్తరణ చేసింది మోడీ సర్కారు. మోడీ హయం లో అర్ధక వ్యవస్థ బలంగా ఉంది. ‘ అని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.