RR vs DC: ఐపీఎల్ సీజన్-16లో భాగంగా ఇవాళ అస్సాం రాష్ట్రం గౌహతిలోని బర్సపారా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు రెండింట్లో ఓటమి మూటగట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్‌తోనైనా ఖాతా తెరువాలని చూస్తోంది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ మెరుపు వేగంతో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఓపెనర్ జైస్వాల్ తొలి ఓవర్‌లో ఏకంగా 5 బౌండరీలు బాదగా.. మరో ఓపెనర్ జోస్ బట్లర్ రెండో ఓవర్‌లో మూడు ఫోర్లు కొట్టాడు. డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 25 బంతుల్లోనే అర్థశతకం సాధించాడు. మొదటి నుంచి కూడా 200లకు పైగా స్ట్రైక్ రేట్ ఈ యువ బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడాడు. అతనికి తోడుగా జోస్ బట్లర్ కూడా ఢిల్లీ బౌలర్లకు చెమటలు పట్టించాడు. కానీ ఢిల్లీ బౌలర్ ముకేశ్ కుమార్ వేసిన 9వ ఓవర్‌లో యశస్వి జైస్వాల్ బౌల్డ్ అయ్యాడు.

98 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్నోయింది. ఎడాపెడా బౌండరీలు బాదిన యశస్వి జైస్వాల్ (60) ఔటయ్యాడు. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి యశస్వి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్(0) కూడా కాసేపట్లోనే పెవిలియన్ చేరాడు. 10వ ఓవర్ ఐదో బంతికి 103 పరుగుల స్కోర్ వద్ద కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో నోర్జేకు క్యాచ్ ఇచ్చి సంజూ శాంసన్ డకౌటయ్యాడు. ప్రస్తుతం బట్లర్ (40), రియాన్ పరాగ్ క్రీజ్‌లో ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ 10 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేయగలింది.
తొలి ఓవర్ నుంచి దూకుడుగా ఆడుతున్న రాజస్థాన్ జట్టుకు మొదట ఢిల్లీ బౌలర్ ముఖేశ్ కుమార్ కళ్లెం వేశాడు. తొమ్మిదో ఓవర్ మూడో బంతికి మంచి ఊపు మీదున్న యశస్వి జైశ్వాల్‌ను ఔట్ చేశాడు. రిటర్న్ క్యాచ్‌తో జైస్వాల్‌ను పెవిలియన్‌కు పంపాడు. అప్పటికి జైస్వాల్ స్కోరు 31 బంతుల్లో 60 పరుగులు. అందులో 11 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అనంతరం కుల్‌దీప్ యాదవ్ సంజు శాంసన్‌ను పెవిలియన్ చేర్చి మరో దెబ్బ కొట్టాడు.