NTV Telugu Site icon

England: ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టు విఫలం.. కెప్టెన్సీకి బట్లర్ రాజీనామా

Jos Buttler

Jos Buttler

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ జట్టు పూర్తి విఫలమైంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, ఆఫ్గానిస్తాన్ చేతిలో ఓడిపోయింది. ఈ క్రమంలో జట్టు కెప్టెన్ బట్లర్ పై విమర్శలు వచ్చాయి. దీంతో.. జోస్ బట్లర్ వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు. కాగా.. గురువారం ఆఫ్గాన్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టు ఓటమికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read Also: BJP: డీకే శివకుమార్ మరో ఏక్‌నాథ్ షిండే..

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. తర్వాత.. ఆఫ్గానిస్తాన్ చేతిలో పోరాడి ఓడింది. తర్వాత మ్యాచ్ దక్షిణాఫ్రికాతో జరగనుంది. ఈ మ్యాచ్ బట్లర్ కెప్టెన్సీకి చివరిది అవుతుంది. కాగా.. బట్లర్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ జట్టు వరుసగా 7 ఓటములను చవి చూసింది. 2022 జూన్‌లో జోస్ బట్లర్ ఇంగ్లాండ్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. అయితే.. కెప్టెన్‌గా సక్సెస్ కాలేదు. 34 వన్డేలకు కెప్టెన్సీ చేసిన బట్లర్.. 22 సార్లు ఓటమిని ఎదుర్కొన్నాడు. అయితే.. 2022లో ఇంగ్లండ్‌కు రెండోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్ సాధించి పెట్టాడు. ఆ తర్వాత నుంచి జట్టు ప్రదర్శనలో మార్పులు వచ్చాయి.

Read Also: New Motor Vehicle Act: వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపటి నుంచి ఈ తప్పులు చేశారో భారీగా ఫైన్!