Jon Landau Death: హాలీవుడ్‌లో విషాదం.. టైటానిక్, అవతార్ చిత్రాల నిర్మాత కన్నుమూత!
- హాలీవుడ్‌లో తీవ్ర విషాదం
- అవతార్ నిర్మాత కన్నుమూత
- రెండు సినిమాలకు సహాయ నిర్మాతగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Avatar Movie Producer Jon Landau Dies: హాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. యూనివర్సల్ బ్లాక్ బస్టర్ చిత్రాలైన టైటానిక్, అవతార్‌ల నిర్మాత జోన్ లండౌ కన్నుమూశారు. ఆయన వయసు 63. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన లాస్ ఏంజిల్స్‌లో జూలై 5న మృతి చెందారు. జోన్ లండౌ క్యాన్సర్‌తో 16 నెలల ఓటు పోరాటం చేశారు. జోన్ లండౌ శుక్రవారం తుదిశ్వాస విడవగా.. విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు.
ఆస్కార్ విన్నింగ్ చిత్రం టైటానిక్, సంచలనాత్మక సినిమా ‘అవతార్’లను జోన్ లండౌ నిర్మించారు. డైరెక్టర్ జేమ్స్ కామెరూన్‌తో కలిసి ప్రస్తుతం అవతార్ సినిమాల ఫ్రాంఛైజీ చిత్రాలను ఆయన నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు జోన్ లండౌ తన కెరీర్‌లో అవతార్ 4 చిత్రాలతో కలిపి.. మొత్తంగా 8 సినిమాలను నిర్మించారు. రెండు సినిమాలకు ఆయన సహాయ నిర్మాతగా కూడా వ్యవహరించారు. కామెరూన్‌తో లాండౌ సంయుక్తంగా నిర్మించిన చిత్రాలు మూడు ఆస్కార్ నామినేషన్‌లకు ఎంపికయ్యాయి.
Also Read
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
Also Read: IND vs PAK: పాకిస్తాన్ చేతిలో భారత్ దారుణ ఓటమి.. సురేష్ రైనా చెలరేగినా..!
జోన్ లండౌ 1980లో ప్రొడక్షన్ మేనేజర్‌గా సినీ కెరియర్‌ను ప్రారంభించారు. డైరెక్టర్ జేమ్స్ కామెరూన్‌తో కలిసి టైటానిక్ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం రికార్డులను తిరగరాయడమే కాకుండా.. ఎనలేని గుర్తింపును తీసుకు వచ్చింది. ఈ సినిమాకు 14 ఆస్కార్స్ నామినేషన్స్ రాగా.. 11 అవార్డులు గెలుచుకుని హాలీవుడ్ సినిమా చరిత్రను తిరగరాసింది. లాండౌ నిర్మాతగా 2009లో విడుదలైన అవతార్ సినిమా సుమారు రూ.24 వేల కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.ఇప్పటికీ ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవతార్ కొనసాగుతోంది. అవతార్ 2 రూ. 19 వేల కోట్లు రాబట్టింది. లాండౌ చివరగా నిర్మించిన అవతార్ సిరీస్‌లో 3వ భాగం 2026లో, 4వ భాగం 2030లో రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!