NTV Telugu Site icon

TS Transport: అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్.. ఇకపై చర్యలు తప్పవు..

Travels

Travels

TS Transport: తెలంగాణ రాష్ట్రంలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ పై కొరడా ఝులిపించేందుకు రవాణా శాఖ సిద్దమవుతుంది. విజయవాడ, వైజాగ్, బెంగుళూరు రూట్స్ లో ఎక్కువ వసూలు చేస్తున్నట్టు తెలిసింది.. అందుకే స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టామని జాయింట్ ట్రాన్ పోర్ట్ కమిషనర్ రమేష్ అన్నారు. అందులో 79 బస్సుల పైన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. వీటిల్లో రూ.35 వేల జరిమానా కూడా విధించినట్లు ఆయన పేర్కొన్నారు.

Read Also: Union Minister Kishan Reddy: మూడు రైళ్లను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

పండగ సమయంలో అత్యధిక వసూళ్లు చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని జాయింట్ ట్రాన్ పోర్ట్ కమిషనర్ రమేష్ తెలిపారు. టాక్స్ లేని బస్సులు కూడా చక్కర్లు కొడుతుంటాయి.. అందులో ఏపీ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయని.. ఆ బస్సులను సీజ్ చేసామన్నారు. ప్రయాణికులకు కూడా విజ్ఞప్తి.. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ పైన రవాణా శాఖకు ఫిర్యాదులు అందించాలని ఆయన కోరారు. ఇప్పటికే రవాణా శాఖ అధికారులు ఉదయాన్నే డ్రైవ్ లు నిర్వహిస్తున్నట్లు రమేష్ తెలిపారు.

Read Also: Private Travels: పండగ సమయంలో అడ్డగోలు దోపిడీ.. టికెట్స్ రేట్లు ఎంతో తెలుస్తే నోరెళ్లబెడుతారు..!