NTV Telugu Site icon

Jogi Ramesh : పేదల ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమం చేపడుతుండటం ఒక చరిత్ర

Jogi Ramesh

Jogi Ramesh

గుంటూరు జిల్లా‌‌ వెంకటపాలెంలో సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు జోగి రమేష్, విడదల రజని. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. పేదల ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమం చేపడుతుండటం ఒక చరిత్ర అని ఆయన కొనియాడారు. పేదలకు ఇళ్లు కట్టకూడదని పెత్తందార్లు ఒకవైపు… పేదలకు ఇళ్లు కట్టిచూపిస్తానని పేదల పక్షాన సీఎం జగన్ అని ఆయన అన్నారు. చంద్రబాబు, పవన్ పేదల ఇళ్లకు అడ్డుపడ్డారని, సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కోర్టులకు చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఈ ప్రాంతానికి వచ్చి ఇళ్ళు కట్టుకోవడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. పెత్తందార్ల పక్షాన చంద్రబాబు సుప్రీంకోర్టు వరకూ వెళ్లాడని, పెత్తందార్ల కోటలను బద్ధలుకొడుతున్నామని సగర్వంగా చెబుతున్నామన్నారు జోగి రమేష్‌. 50వేల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లు కట్టిస్తున్నామని గర్వంగా చెబుతున్నామని, ఆరు నెలల్లో ఇళ్లు పూర్తి చేయబోతున్నామన్నారు.

Also Read : Kethika Sharma : బిగుతైనా అందాలతో రెచ్చగొడుతున్న కేతిక శర్మ..

గృహప్రవేశాలు చేసి జయహో జగనన్న నినాదాలతో ఈ ప్రాంతం మారుమోగేలా చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం.. మంత్రి విడదల రజని మాట్లాడుతూ.. పేదల ఇళ్లను అడ్డుకున్నవారికి ఇదొక కనువిప్పు అన్నారు. చంద్రబాబు ఎక్కడలేని చట్టాలను తీసుకొచ్చి మంచిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందన్నారు విడదల రజిని. పేదలకు మంచి చేయాలనే తపన సీఎం జగన్ ది అని, చంద్రబాబు పేదల వ్యతిరేకిగా ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాడని, పేదల పక్షపాతిగా సీఎం జగన్ ప్రజల మనసులో నిలిచిపోతారని ఆమె అన్నారు.

Also Read : Hyderabad Gold Idli: హైదరాబాద్‌లో గోల్డ్ ఇడ్లీ..! ఇప్పుడిదే ట్రెండింగ్..