సోము వీర్రాజు బీసీ వ్యాఖ్యలపై ఎన్టీవీతో మాట్లాడుతూ.. బీసీ మంత్రుల కౌంటర్ ఇచ్చారు. తాజాగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. సోము వీర్రాజు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బలహీన వర్గాలకు ఏ రకంగా న్యాయం జరుగుతుందో చెప్పాలన్నారు. స్పీకర్, శాసన మండలి వంటి ముఖ్యమైన పదవులు బలహీన వర్గాలకు ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. సుమారు 90 వేల కోట్ల రూపాయలు కేవలం బీసీ వర్గాలకే మా ప్రభుత్వం డీబీటీ విధానంలో ఇచ్చామని, అమ్మ ఒడి, చేయూత, ఆసరా, పెన్షన్, రైతు భరోసా వంటి పథకాలు బీసీలకు అందుతున్న విషయం సోము వీర్రాజుకు తెలియదా అని ఆయన మండిపడ్డారు. 32 కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు అవుతున్నాయని, సామాజిక న్యాయం జగన్ తోనే సాధ్యం అయ్యిందని, వైసీపీ కుటుంబ పార్టీ ఎందుకు అవుతుందని ఆయన మండిపడ్డారు. జగన్ ఒక్కడితో, స్వయం కృషితో ప్రారంభం అయిన పార్టీ వైసీపీ అని, రాజశేఖరరెడ్డి ఆలోచనల స్ఫూర్తితో పుట్టిన పార్టీ వైసీపీ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Minister KTR : జీ20 లోగోకు రిటర్న్ గిఫ్ట్‌గా తెలంగాణకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను మంజూరు చేయండి
అనంతరం మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్ మాట్లాడుతూ.. సోము వీర్రాజు ఇప్పుడు బీసీలను చైతన్య వంతులు చేస్తారట.. బీసీలు చైతన్య వంతులు కావటం వల్లే 151 స్థానాలు వైసీపీకి కట్టబెట్టారు అని ఆయన అన్నారు. ఎవరి మెప్పు కోసమో సోము వీర్రాజు విమర్శలు చేస్తున్నారని, మంత్రులం ఉద్యోగుల బదిలీలు చేయటానికి ఉన్నామా?? మేము ప్రజా సేవ చేయటానికి, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం, సోము వీర్రాజుకు రాష్ట్రం పై ప్రేమ ఉంటే రాష్ట్రానికి రావలసిన విభజన హామీలు వచ్చేటట్లు చేయాలి అని ఆయన అన్నారు. సోము వీర్రాజు మాటలను ఎవరూ పట్టించుకోవడం లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే జగన్ కుటుంబమని, జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి తట్టుకోలేకే సోము వీర్రాజు విమర్శలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
Also Read : Dhanush: పూజతో మొదలైన ధనుష్, శేఖర్ కమ్ముల త్రిభాషా చిత్రం!