Gabba Test: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య గబ్బా వేదికగా జరుగుతున్న డే/నైట్ (పింక్ బాల్) రెండో టెస్టు మ్యాచ్ ఉత్కంఠగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించి భారీ శతకం బాదడంతో, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 334 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది జో రూట్ బ్యాటింగ్. రూట్ 138 పరుగులు (206 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇతడి టెస్టు కెరీర్‌లో ఇది 40వ సెంచరీ కాగా.. ఆస్ట్రేలియా గడ్డపై ఏ ఫార్మాట్‌లోనైనా రూట్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.
IND vs SA: విశాఖలో టీమిండియా రికార్డులు అద్భుతం.. ధోనీ గుర్తింపు, రో-కో ఫైర్‌బ్రాండ్ ఇక్కడే!
ఈ సెంచరీతో రూట్.. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యల నుండి అతడిని కాపాడాడు. ఈ సిరీస్ ఆరంభానికి ముందు, రూట్ యాషెస్‌లో సెంచరీ సాధిస్తాడు. ఒకవేళ చేయకపోతే తాను మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో నగ్నంగా నడుస్తానని హేడెన్ సవాల్ విసిరాడు. తొలి టెస్టులో విఫలమైన రూట్, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనే శతకం సాధించడంతో మాథ్యూ హేడెన్ సంబరాలు చేసుకుని, రూట్‌కు ధన్యవాదాలు తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Dry Fruits for Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ నాలుగు డ్రై ప్రూట్స్ ట్రై చేయండి..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 9 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. రెండో రోజు ఆటలో మిగిలిన ఒక్క వికెట్‌ను కోల్పోయి మరో 9 పరుగులను జోడించి మొత్తం 334 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో జో రూట్ (138∗), ఓపెనర్ జాక్ క్రాలీ (76)లతో తో స్కోరర్స్ గా నిలిచారు. రూట్ ఆఖరిలో మెరుపులు మెరిపించిన జోఫ్రా ఆర్చర్ (38)తో కలిసి పదో వికెట్‌కు 70 పరుగులు జోడించడం విశేషం. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ మరోసారి రెచ్చిపోయాడు. ఈ ఇన్నింగ్స్ లో అతను ఆరు వికెట్లు పడగొట్టాడు. మైఖేల్ నేసర్, స్కాట్ బోల్యాండ్, బ్రెండన్ డగ్గెట్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
