Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Joe Root Is A Rare Record In The History Of Test Cricket

Ashes 2023: టెస్ట్ క్రికెట్ చరిత్రలో జో రూట్ అరుదైన రికార్డు..!

Published Date :June 20, 2023 , 3:50 pm
By Rajesh Veeramalla
Ashes 2023: టెస్ట్ క్రికెట్ చరిత్రలో జో రూట్ అరుదైన రికార్డు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ashes 2023: ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య ఎడ్జ్ బాస్టన్ వేదికగా యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన రూట్.. రెండో ఇన్నింగ్స్ లో 46 పరుగులు చేసి స్టంపౌట్ గా పెవిలియన్ చేరాడు. అయితే చేసింది 46 పరుగులే అయినా.. రూట్ ఓ అరుదైన రికార్డు సృష్టించాడు.

Read Also: Madhavilatha : హీరో ప్రభాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవిలత..ఫ్యాన్స్ ఫైర్..

ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో నిలకడైన ఆటగాడిగా మంచి గుర్తింపు పొందాడు. తన ఆటతో ప్రత్యర్థి బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతాడు. సామాన్యంగా అతన్ని ఔట్ చేయాలంటే.. బౌలర్లు శ్రమించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే తాజాగా జరుగుతున్న యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ మ్యాచ్ లో.. తొలి ఇన్నింగ్స్ లో జో రూట్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దాంతో ఇంగ్లాండ్ 393 స్కోరు చేయగలిగింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో జో రూట్ 46 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అయితే ఆసీస్ బౌలర్ నాథన్ లియోన్ స్పిన్ మాయజాలానికి రూట్ స్టంపౌట్ అయ్యాడు.

Read Also: Mega Princess: పాప జాతకం అధ్బుతం.. మనవరాలిపై మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

అయితే జో రూట్ స్టంపౌట్ అవ్వడం ద్వారా రికార్డ్ నెలకొల్పాడు. కెరీర్ లో 130 టెస్టులు ఆడిన రూట్ స్టంపౌట్ అవ్వడం ఇదే తొలిసారి. దాంతో కెరీర్ లో 11,168 రన్స్ చేసిన తర్వాత స్టంపౌట్ అయిన రెండో ఆటగాడిగా నిలిచాడు రూట్. ఇక తొలి స్థానంలో విండీస్ దిగ్గజం చంద్రపాల్ 11,414 పరుగులతో ఉన్నాడు. మూడో స్థానంలో గ్రేమ్ స్మిత్ 8800 పరుగులతో ఉండగా.. టీమిండియా నుంచి విరాట్ కోహ్లీ 8195, సచిన్ 7419 పరుగులు చేసిన తర్వాత స్టంపౌట్ అయ్యి నాలుగు, ఐదు ప్లేసుల్లో నిలిచారు. ఇక టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసి ఒక్కసారి కూడా స్టంపౌట్ కాని ఆటగాడిగా శ్రీలంక ఆటగాడు మహేల జయవర్దనే నిలిచాడు. అతడు టెస్టుల్లో 11,814 రన్స్ చేసి ఒక్కసారి కూడా స్టంపౌట్ కాకపోవడం విశేషం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ashes
  • joe root
  • record
  • Sports
  • testm

తాజావార్తలు

  • Petrol, Diesel Shortage: పెట్రోలు, డీజిల్ సరఫరాపై కేంద్ర మంత్రి సంచలన ప్రకటన.. వారికి వార్నింగ్..

  • Gold &Silver Rates: బంగారం, సిల్వర్ ధరల్లో పెద్ద షాక్.. ఈరోజు రేటు ఎంత పెరిగిందో చూడండి

  • Ben Duckett IPL Ban: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. బెన్‌ డకెట్‌పై రెండేళ్ల నిషేధం!

  • CAFE 3 Rules India: కొత్త నిబంధనలు.. చిన్న కార్ల ధరలకు రెక్కలు..! ఏంటా రూల్స్‌..?

  • TG Govt: పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరతపై ప్రభుత్వం కీలక ప్రకటన.. సందేహాలుంటే ఈ నంబర్‌కి కాల్ చేయండి..

ట్రెండింగ్‌

  • RCB Sale Price: ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన డీల్.. ఆర్‌సీబీ కొత్త ఓనర్స్ ఎవరంటే?

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions