టాలివుడ్ హీరోయిన్ మాధవిలత అందరికి తెలిసే ఉంటుంది.. ఒకప్పుడు సినిమాల్లో మెరిసింది.. ప్రస్తుతం సినిమా అవకాశాలు తక్కువ అవ్వడంతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. అందం, అభినయం ఉన్నా కూడా అవకాశాలు అందని ద్రాక్షలా మారింది.. ఇక ఈ మధ్య మాధవి లత పేరు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తుంది.. తనకు సంబంధం లేని విషయాల్లో కూడా తల దూరుస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.. ఎక్కువగా పవన్ కళ్యాణ్ కు సంబందించిన విషయాల గురించి మాట్లాడే ఈ అమ్మడు ఇప్పుడు ప్రభాస్ ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఆదిపురుష్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..
మొన్నీమధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ సినిమా ‘ఆదిపురుష్’ సినిమా ప్రేక్షకులను మెప్పించటంలోనూ.. జనాల్ని ఒప్పించటంలోనూ విఫలమైంది. రామాయణాన్ని ఇష్టం వచ్చినట్లు చిత్రీకరించారంటూ దర్శకుడు ఓం రౌత్‌పై సోషల్ మీడియా వ్యాప్తంగా ట్రోల్స్ ను అందుకుంటుంది.. ఈ సినిమా చాలా విషయాల్లో రామాయణానికి.. ఆదిపురుష్ సినిమాకు సంబంధం లేకుండా ఉందని, దేవుడి సినిమాను కమర్షియల్ సినిమాగా మార్చేశారని జనం మండిపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సినిమాను బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే ఆదిపురుష్ వివాదంపై హీరోయిన్ మాధవీలత స్పందించారు..
ఈ సినిమా పై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను షేర్ చేసింది.. ఆ పోస్ట్ లో రాముడి పాత్ర చేసిన ప్రభాస్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. సినిమా విషయంలో ప్రభాస్‌ది కూడా తప్పు ఉందని అన్నారు. ఆదిపురుష్ మ్యాటర్‌లో అందరూ డైరెక్టర్‌ని దొబ్బుతున్నారని, హీరో మ్యాటర్‌లో సైలెంట్ అయ్యారని అన్నారు. హీరోకి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. స్టోరీ వినేటప్పుడు, తీసేటప్పుడు, డైలాగ్ చెప్పేటప్పుడు తెలియలేదా అని అన్నారు.. ప్రభాస్ ఏమైనా కొత్తగా సినిమాలు చేస్తున్నారా..డైరెక్టర్ ఏదీ చెబితే అది చెయ్యడానికి కథ విన్నాడుగా అప్పుడే తెలియాలి కదా అంటూ తీవ్ర విమర్శలు చేసింది.. ఈ విషయంలో ఫ్యాన్స్ నన్ను ఏమన్నా పర్వాలేదు.. ప్రభాస్ దే తప్పు అంటూ రాసుకొచ్చింది.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ మాధవీ లతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో జోలికి వస్తే ఊరుకునేది లేదని అంటున్నారు..ప్రస్తుతం దీనిపై పెద్ద చర్చే నడుస్తుంది..ఈ విషయం పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి..