Site icon NTV Telugu

Joe biden: సూసైడ్ నిర్ణయాన్ని విరమించుకున్నా.. అధ్యక్షుడు కాకముందు ఏం జరిగిందంటే..!

Beie

Beie

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను పంచుకున్నారు. ఐదు దశాబ్దాల క్రితం జరిగిన పరిణామాలను ఆయన గుర్తుచేశారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు తనకు వచ్చాయని… వెంటనే వాటి నుంచి బయటపడినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వ్యక్తిగత జీవిత వివరాలు పంచుకున్నారు. డెలావేర్ మెమోరియల్‌ బ్రిడ్జ్‌ దగ్గరకు వెళ్లిన తాను అక్కడి నుంచి దూకి ఆత్మచేసుకోవాలనే ఆలోచన వచ్చిందన్నారు. అయతే తన పల్లల గురించి ఆలోచించి ఆత్మహత్య చేసుకుకోవాలన్న నిర్ణయాన్ని విరమించుకున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: Ponguleti Srinivasa Reddy: ధరణి అనే దయ్యాన్ని సరిదిద్ధు తున్నాం..

1972 సంవత్సరంలో తొలిసారి సెనేటర్‌గా గెలుపొందిన కొన్నిరోజులకు బైడెన్‌.. తన భార్య నీలియా, 18 నెలల బాబు రోడ్డు ప్రమాదంలో చనిపోయారని వెల్లండించారు. ఆ సమయలో చాలా బాధలో ఉన్న తనకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందని చెప్పారు. ఆ బాధలో తాగటం అలవాటు లేని తనకు మందు బాటిల్‌ తీసుకొని డెలావేర్‌ బ్రిడ్జ్‌ వద్దకు వెళ్లి తాగుతుండగా.. ఆత్మహత్య ఆలోచన వచ్చిందన్నారు. కానీ తన మిగతా ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఆలోచించి.. ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు చెప్పుకొచ్చారు. కష్టాలు వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలన్న పిచ్చి ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదని బైడెన్ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Congress: ‘‘ముస్లిం ఓట్లు కావాలి కానీ, అభ్యర్థులు వద్దా..?’’ కాంగ్రెస్‌ని ప్రశ్నించిన మైనారిటీ నేత..

ఇదిలా ఉంటే మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్-బైడెన్ తలపడుతున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ గురించి మాట్లాడుతూ.. అమెరికా ఎన్నికలకు ముందే డిబేట్‌లో పాల్గొనాలని ఉన్నట్లు తెలిపారు. ఎక్కడైనా ఓ చోట ట్రంప్‌తో డిబేట్‌ తనకు సంతోషమన్నారు. దీనిపై ట్రంప్‌ సైతం ప్రతిస్పందిస్తూ.. తాను కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సమయానికైనా బైడెన్‌తో డిబేట్‌కు అంగీకరిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ట్రంప్ పేర్కొన్నారు. ఇక అధ్యక్ష పదవి ఎన్నికల డిబేట్ల ఎన్నికల తేదీలు, వేదికల వివరాలు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 16న టెక్సాస్‌లోని శాన్ మార్కోస్‌, అక్టోబర్ 1న వర్జీనియాలోని పీటర్స్‌బర్గ్‌, అక్టోబర్ 9న సాల్ట్ లేక్ సిటీలో జరగనున్నాయి.

ఇది కూడా చదవండి: B Vinod Kumar: కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లో బండి సంజయ్, వినోద్ కుమార్ మధ్యనే పోటీ..

Exit mobile version