Korean Blogger: చీ.. చీ.. యువతికి ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ వేధించిన యువకుడు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Korean Blogger: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. కొరియా దేశానికి చెందిన బ్లాగర్‌ను ఓ యువకుడు వేధించాడు. ఒంటరిగా కనిపించిన ఆ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. కొరియన్ యువతిని ఫాలో అయ్యి రెచ్చిపోయాడు. కొరియన్ బ్లాగర్ తన కెమెరాలో అక్కడి ప్రదేశాలను చిత్రీకరిస్తుండగా.. ఆ యువకుడు తన దుస్తులు విప్పి, వికృతంగా నవ్వుతూ ప్రైవేట్ పార్ట్స్ బయటకు తీసి చూపించాడు. ఆ యువకుడి వెకిలి చేష్టలతో ఆ యువతి భయపడిపోయింది. భయంతో పరుగులు తీసింది. హెల్ప్ అంటూ గట్టిగా కేకలు వేసింది.
తన చేతిలో ఉన్న కెమెరాతో యువకుడి వికృత చేష్టలను రికార్డ్ చేసింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. ఇదంతా పట్టపగలే జరిగింది. అయితే ఆ సమయంలో అక్కడ పెద్దగా జనసంచారం లేదు. దాంతో ఆ యువకుడు రెచ్చిపోయాడు. కొరియన్ యువతి భయంతో పరుగులు తీయగా.. ఆ యువకుడు కూడా ఆమె వెనకాలే పరిగెత్తాడు. కొంత దూరం తర్వాత ఆగిపోయాడు. వీడియో వైరల్‌గా మారడంతో దీనిపై తీవ్ర దుమారం రేగింది. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది. వెంటనే వారు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. వీడియో ఆధారంగా వికృత చేష్టలకు పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
జోధ్‌పూర్‌లో కొరియన్ బ్లాగర్‌పై జరిగిన లైంగిక వేధింపులను ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఖండించారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు లేఖ రాస్తానని చెప్పారు. ఇది చాలా బాధాకరమైన, దారుణమైన ఘటన అన్నారు. సిగ్గుతో తలదించుకునే సంఘటన అని వాపోయారు. ఇలాంటి కొందరు నీచుల వల్ల మన దేశం పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఆ నీచుడిని కఠినంగా శిక్షించాలన్నారు.
Read Also: Crime News: పరీక్ష ముగించుకుని వస్తున్న మహిళపై ముసుగులు ధరించి..
గత డిసెంబర్‌లో ముంబైలోని ఖార్‌లో దక్షిణ కొరియాకు చెందిన యూట్యూబర్‌ను ఇద్దరు వ్యక్తులు లైంగికంగా వేధించారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో లైవ్ వీడియోను చిత్రీకరిస్తున్న యూట్యూబర్ యొక్క 60 సెకన్ల వీడియో, ఒక వ్యక్తి ఆమె చేయి పట్టుకున్నట్లు చూపించడంతో లైంగిక వేధింపులపై ఆగ్రహం చెలరేగింది. నిందితులు బాంద్రాకు చెందిన మొబీన్ చంద్ మహ్మద్ షేక్, మహ్మద్ నకీబ్ సద్రీలామ్ అన్సారీలను అరెస్టు చేసిన తర్వాత 24 గంటల పాటు పోలీసు కస్టడీకి పంపారు.
తాజావార్తలు
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..