రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. కొరియా దేశానికి చెందిన బ్లాగర్‌ను ఓ యువకుడు వేధించాడు. ఒంటరిగా కనిపించిన ఆ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. కొరియన్ యువతిని ఫాలో అయ్యి రెచ్చిపోయాడు. కొరియన్ బ్లాగర్ తన కెమెరాలో అక్కడి ప్రదేశాలను చిత్రీకరిస్తుండగా.. ఆ యువకుడు తన దుస్తులు విప్పి, వికృతంగా నవ్వుతూ ప్రైవేట్ పార్ట్స్ బయటకు తీసి చూపించాడు. ఆ యువకుడి వెకిలి చేష్టలతో ఆ యువతి భయపడిపోయింది.