Site icon NTV Telugu

Korean Blogger: చీ.. చీ.. యువతికి ప్రైవేట్‌ పార్ట్స్‌ చూపిస్తూ వేధించిన యువకుడు.. వీడియో వైరల్

Korean Blogger

Korean Blogger

Korean Blogger: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. కొరియా దేశానికి చెందిన బ్లాగర్‌ను ఓ యువకుడు వేధించాడు. ఒంటరిగా కనిపించిన ఆ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. కొరియన్‌ యువతిని ఫాలో అయ్యి రెచ్చిపోయాడు. కొరియన్ బ్లాగర్ తన కెమెరాలో అక్కడి ప్రదేశాలను చిత్రీకరిస్తుండగా.. ఆ యువకుడు తన దుస్తులు విప్పి, వికృతంగా నవ్వుతూ ప్రైవేట్ పార్ట్స్ బయటకు తీసి చూపించాడు. ఆ యువకుడి వెకిలి చేష్టలతో ఆ యువతి భయపడిపోయింది. భయంతో పరుగులు తీసింది. హెల్ప్ అంటూ గట్టిగా కేకలు వేసింది.

తన చేతిలో ఉన్న కెమెరాతో యువకుడి వికృత చేష్టలను రికార్డ్ చేసింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. ఇదంతా పట్టపగలే జరిగింది. అయితే ఆ సమయంలో అక్కడ పెద్దగా జనసంచారం లేదు. దాంతో ఆ యువకుడు రెచ్చిపోయాడు. కొరియన్ యువతి భయంతో పరుగులు తీయగా.. ఆ యువకుడు కూడా ఆమె వెనకాలే పరిగెత్తాడు. కొంత దూరం తర్వాత ఆగిపోయాడు. వీడియో వైరల్‌గా మారడంతో దీనిపై తీవ్ర దుమారం రేగింది. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది. వెంటనే వారు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. వీడియో ఆధారంగా వికృత చేష్టలకు పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

జోధ్‌పూర్‌లో కొరియన్ బ్లాగర్‌పై జరిగిన లైంగిక వేధింపులను ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఖండించారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు లేఖ రాస్తానని చెప్పారు. ఇది చాలా బాధాకరమైన, దారుణమైన ఘటన అన్నారు. సిగ్గుతో తలదించుకునే సంఘటన అని వాపోయారు. ఇలాంటి కొందరు నీచుల వల్ల మన దేశం పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఆ నీచుడిని కఠినంగా శిక్షించాలన్నారు.

Read Also: Crime News: పరీక్ష ముగించుకుని వస్తున్న మహిళపై ముసుగులు ధరించి..

గత డిసెంబర్‌లో ముంబైలోని ఖార్‌లో దక్షిణ కొరియాకు చెందిన యూట్యూబర్‌ను ఇద్దరు వ్యక్తులు లైంగికంగా వేధించారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో లైవ్ వీడియోను చిత్రీకరిస్తున్న యూట్యూబర్ యొక్క 60 సెకన్ల వీడియో, ఒక వ్యక్తి ఆమె చేయి పట్టుకున్నట్లు చూపించడంతో లైంగిక వేధింపులపై ఆగ్రహం చెలరేగింది. నిందితులు బాంద్రాకు చెందిన మొబీన్ చంద్ మహ్మద్ షేక్, మహ్మద్ నకీబ్ సద్రీలామ్ అన్సారీలను అరెస్టు చేసిన తర్వాత 24 గంటల పాటు పోలీసు కస్టడీకి పంపారు.

Exit mobile version