SBI Recruitment 2024: ఎస్బీఐలో ఉద్యోగాలు..భారీగా జీతం..హైదరాబాద్ లో కూడా అవకాశం
- ఉద్యోగానికి ఎంపికైతే.. రూ.69810 వరకు పే స్కేల్
- ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- కోల్‌కతా.. హైదరాబాద్‌లో ఖాళీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఉద్యోగం (ప్రభుత్వ ఉద్యోగం) పొందాలని కలలు కంటారు. మీ కల నెరవేర్చుకునే రోజు ఆసన్నమైంది. ఎస్బీఐ తీపి కబురు చెప్పింది. ఎస్బీఐ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల కోసం ఖాళీలను విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.inని సందర్శించాల్సి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులను ఫిల్ చేయనుంది. ఎస్బీఐ ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ సర్వీసెస్ 2 (MMGS 2)లోని ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు కోల్‌కతా, హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుంది. బ్యాంకు మొత్తం 150 మంది ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్లను రిక్రూట్ చేసుకోనుంది. జనరల్ కేటగిరీకి 61, ఎస్సీలకు 25, ఎస్టీలకు 11, ఓబీసీలకు 38, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 15 ఖాళీలు ఉన్నాయి. డిసెంబర్ 31, 2023 నాటికి 23 నుంచి 32 ఏళ్ల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుకు అర్హులు. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, కాలేజీలలో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్(IIBF) నుంచి ‘ఫారెక్స్’లో పొందిన సర్టిఫికెట్ ఉండాలి. డాక్యుమెంటరీ క్రెడిట్ స్పెషలిస్ట్, ట్రేడ్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్‌లో సర్టిఫికెట్ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
Also Read
- Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
- Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్‌పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ రెండు దశల్లో ఉంటుంది. ఎస్బీఐ నియామక కమిటీ అభ్యర్థుల నుంచి అప్లికేషన్లను స్వీకరిస్తుంది. కొన్ని ప్రమాణాలను ఆధారంగా చేసుకుని వీరి నుంచి కొందరిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలకు పిలుస్తుంది. ఇంటర్వ్యూలలో మెరిట్ సాధించిన వారిని పోస్టుకు ఎంపిక చేస్తుంది. ఇద్దరు అభ్యర్థులకు సమానమైన మార్క్స్ వస్తే సీనియారిటీ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. ఎస్బీఐ స్పెషలిస్ట్ క్యాడర్ పోస్టులకు ఆన్లైన్లో అప్లికేషన్లను స్వీకరిస్తోంది. జూన్ 27 లోగా అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు రూ.750 గా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొంది. ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు రూ.48,170 నుంచి రూ.69,810 వరకు పే స్కేల్ ఉంటుంది. క్వాలిఫికేషన్, అనుభవం ఆధారంగా శాలరీని నిర్ణయిస్తుంది. శాలరీతో పాటు డియర్నెస్ అలవెన్స్(DA), సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్(CCA), హౌజ్ రెంట్ అలవెన్స్(HRA), ప్రావిడెంట్ ఫండ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఫండ్, తదితర బెనిఫిట్స్ ఉంటాయి. 6 నెలల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది.
తాజావార్తలు
-
Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Japan Earthquake: జపాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం.. 20 మందికి గాయాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం
-
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభ వార్తలే.. నేడు డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!